9 వరకు ‘సర్’ కీలక అధికారుల బదిలీలకు బ్రేక్
ABN , Publish Date - Sep 25 , 2026 | 06:43 AM
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ విధులు నిర్వహిస్తున్న కీలక ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగులపై నిషేధాన్ని అక్టోబరు 9 వరకు పొడిగించారు.
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ విధులు నిర్వహిస్తున్న కీలక ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగులపై నిషేధాన్ని అక్టోబరు 9 వరకు పొడిగించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సర్ కొత్త షెడ్యూల్ ప్రకారం సీఈవో వివేక్‌యాదవ్ గురువారం ఈ చర్యలు తీసుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి...