సీపీఐతో కలసి జగన్ పోరాటమా?
ABN , Publish Date - Sep 26 , 2026 | 06:10 AM
ఇండి కూటమిలో ఉన్న సీపీఐతో కలసి ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఒప్పందం చేసుకోవడం...
వైపీసీ శ్రేణులు ఆలోచించుకోవాలి: విజయసాయిరెడ్డి
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఇండి కూటమిలో ఉన్న సీపీఐతో కలసి ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఒప్పందం చేసుకోవడంపై రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇండియా కూటమిలో ఉన్న సీపీఐతో కలసి వైసీపీ ప్రజా పోరాటాలను చేయాలని ఒప్పందం చేసుకున్నట్లుగా జగన్ సొంత పత్రికలో వార్త వచ్చిందని విజయసాయి పేర్కొన్నారు. కూటమితో పొత్తు ఉన్న సీపీఐతో కలసి జగన్ ప్రజా సమస్యలపై ఎలా పోరాటం చేస్తారో ఆలోచించుకోవాలని వైసీపీ శ్రేణులకు సలహా ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ