Share News

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

ABN , Publish Date - Sep 25 , 2026 | 09:30 PM

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
bjp ram madhav on congress party

విజయవాడ, సెప్టెంబర్ 25: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్జానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేయడాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ ఖండించారు.


ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీని ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రామ్ మాధవ్ ఆరోపించారు. రాజకీయ వ్యవస్థల్లోనూ.. ప్రజల మనసుల్లోను ఓ భ్రాంతిని సృష్టించేందుకే ప్రతిపక్ష పార్టీలు కంకణం కట్టుకున్నాయన్నారు. అందుకే రాజ్యాంగ వ్యవస్థలను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.


ఎన్నికల్లో అక్రమాలు జరిగితే కేరళ, కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్‌లలో ప్రతిపక్షాలు ఎలా గెలిచాయని రామ్ మాధవ్ ప్రశ్నించారు. ఎన్నికల జాబితా పరిశీలన ప్రక్రియలో సాంకేతికంగా, కంప్యూటర్ ద్వారా వివరాలు జనరేట్ అవుతాయని.. దీంట్లో ఫ్రాడ్ చేయడానికి ఆస్కారం ఎలా ఉంటుందన్నారు. పని గట్టుకుని, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు ఈ కుట్రలు చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ కేవలం వ్యక్తివాదం కోసం పుట్టింది కాదని.. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వంటి మహాపురుషులు అందించిన 'మానవతావాద' సిద్ధాంతం కోసం పనిచేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ స్పష్టంచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. హైదరాబాద్, విజయవాడలో నేటి ధరలివే

ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకత.. వేలం లేకుండానే భక్తులకు ప్రసాదంగా పంపిణీ..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 09:39 PM