హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ
ABN , Publish Date - Sep 25 , 2026 | 09:27 PM
తిరుపతిలోని శ్రీ స్వామి హథీరాంజీ మఠం భూముల లీజుదారులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ధనుంజయ్ రెడ్డి సహా తదితరుల పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. లీజులు రద్దు చేస్తూ ఇచ్చిన సెక్షన్ 82 నోటీసులను, తదుపరి చర్యలను సవాలు చేస్తూ ధనుంజయ్ రెడ్డితో సహా మొత్తం 13 మంది దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: తిరుపతిలోని శ్రీ స్వామి హథీరాంజీ మఠం భూముల లీజుదారులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ధనుంజయ్ రెడ్డి సహా తదితరుల పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. లీజులు రద్దు చేస్తూ ఇచ్చిన సెక్షన్ 82 నోటీసులను, తదుపరి చర్యలను సవాలు చేస్తూ ధనుంజయ్ రెడ్డితో సహా మొత్తం 13 మంది దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం లాజిస్టికల్ మద్దతే అందించిందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది.. ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మఠానికి సంబంధిచిన వేలాది ఎకరాల భూములకు రికార్డులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిరుడు మే నెలలో సుప్రీంకోర్టే విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సెక్షన్ 82 కింద తీసుకున్న చర్యలను హైకోర్టు సమర్థించిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు తమకు తగిన కారణాలేమీ కనిపించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఇవి కూడా చదవండి..
ఆత్మకూరు కేజీబీవీ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
వైసీపీకి యనమల కృష్ణుడు రాజీనామా.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక
Read Latest AP News And Telugu News