ఆత్మకూరు కేజీబీవీ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
ABN , Publish Date - Sep 25 , 2026 | 07:09 PM
నంద్యాల జిల్లా ఆత్మకూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో హాస్టల్‌పై నుంచి దూకి విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 25: నంద్యాల జిల్లా ఆత్మకూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో హాస్టల్‌పై నుంచి దూకి విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించి.. త్వరితగతిన కోలుకునేలా చూడాలని ఐసీపీఎస్ డీసీపీఓ మంజునాథ్, సఖి మేనేజర్ శాంతామణిని ఆదేశించారు. దీంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? అర్ధరాత్రి బాలిక ఎందుకు గోడ దూకింది?, ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను అడిగి ఆమె తెలుసుకున్నారు.
గురువారం అర్ధరాత్రి తీవ్రంగా గాయపడిన ఆ బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించకుండా రాత్రంతా హాస్టల్‌లోనే ఎందుకు ఉంచారని అధికారులపై మండిపడ్డారు. ఈ రోజు (శుక్రవారం) ఉదయం చాలా ఆలస్యంగా బాలికను ఆస్పత్రికి తరలించడంతోపాటు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై చైర్ పర్సన్ రాయపాటి శైలజా సీరియస్ అయ్యారు.
ఇవి కూడా చదవండి..
వైసీపీకి యనమల కృష్ణుడు రాజీనామా.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపయ్య
Read Latest AP News And Telugu News