Share News

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

ABN , Publish Date - Sep 26 , 2026 | 06:32 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోగా క్యూలైన్‌ కృష్ణతేజ సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgబుధవారం హుండీ ఆదాయం: రూ.3.40కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 67,534

తలనీలాలు సమర్పించినవారు: 25,411


ఈ వార్తలు కూడా చదవండి:

వికసిత్‌ భారత్‌లో ఏపీనే కీలకం

గురువులపై దాడి చేసిన ఏ ఒక్కరినీ వదలిపెట్టం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 06:52 AM