Share News

‘సర్‌’పై కాంగ్రె‌స్‌ది ద్వంద్వ వైఖరి

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:53 AM

ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్‌) బీజేపీ కుట్ర అయితే.. ఈ ప్రక్రియ జరిగిన కేరళంలో కాంగ్రెస్‌ ఎలా గెలిచిందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీని నిలదీశారు.

‘సర్‌’పై కాంగ్రె‌స్‌ది ద్వంద్వ వైఖరి
Telangana BJP

  • కిషన్‌రెడ్డి మండిపాటు..

  • ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీకి ఓట్‌ చోరీ అనే అర్హత లేదని వ్యాఖ్య

  • రాజ్యాంగ సంస్థలను పావుగా వాడుకుంది కాంగ్రెస్‌ ప్రభుత్వాలే

  • ఎంపీ కె.లక్ష్మణ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్‌) బీజేపీ కుట్ర అయితే.. ఈ ప్రక్రియ జరిగిన కేరళంలో కాంగ్రెస్‌ ఎలా గెలిచిందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీని నిలదీశారు. కాంగ్రెస్‌ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్లు.. మరో పార్టీ గెలిస్తే ప్రజాస్వామ్యానికి విఘాతమా? అని మండిపడ్డారు. ‘సర్‌’పై కాంగ్రె్‌సది ద్వంద్వ వైఖరి అని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై అభ్యంతరకరమైన భాషను వాడకుండా సంయమనం పాటించాలని రాహుల్‌ను డిమాండ్‌ చేశారు.


‘అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికైన ప్రధానమంత్రి, హోంమంత్రులను ‘దేశద్రోహులు’ అంటూ రాహుల్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. కోట్లాది మంది నమ్మకంతో ఓటేసి గెలిపించిన వారిపై రాహుల్‌ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఆయన మానసిక స్థితిని,అసహనాన్ని తెలియజేస్తోంది. ఎన్నికల్లో వరుసగా ఓడిపోతుండటంతో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారనిపిస్తోంది.’ అని కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. ‘ఒక పార్టీ గుర్తుతో గెలిచి వేరే పార్టీలోకి ఫిరాయించిన దానం నాగేందర్‌పై సుప్రీం కోర్టు అనర్హత వేటు వేయడాన్ని స్వాగతించి, క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. ప్రజాస్వామ్యం గురించి రాహుల్‌ పాఠాలు చెప్పడం హాస్యాస్పదం. ఫిరాయింపుల ద్వారా ప్రజల తీర్పును దొంగిలించిన పార్టీకి..


ఇతరులు ఓట్లు దొంగిలించారని ఆరోపించే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్‌ పార్టీకి దేశవ్యాప్తంగా లక్షలాది మంది బూత్‌ ఏజెంట్లు ఉన్నారు. ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు ఉంటే.. తెలియజేయడానికి చాలా సమయం ఇచ్చారు. అయినా ఎలాంటి అభ్యంతరాలు దాఖలు చేయలేదు. ‘ఓట్‌ చోరీ’ జరిగిందని ప్రమాణపూర్వకంగా చెప్పాలని డిమాండ్‌ చేస్తే రాహుల్‌ గాంధీ మౌనం వహించారు. అలాంటప్పుడు ఎందుకు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తారు? ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ అనే విషయంలో మాకో క్లారిటీ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థ వ్యవహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.. చేసుకోదు కూడా...’ అని ఆయన స్పష్టం చేశారు.


కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ), ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్‌) ప్రక్రియ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల చరిత్ర అంతా రాజ్యాంగ సంస్థలను పావులుగా వాడుకున్న ఉదంతాలతోనే నిండి ఉందని, అలాంటి పార్టీ ఇవాళ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా జరుగుతున్న ‘సర్‌’ ప్రక్రియను తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.


ఎమర్జెన్సీ సమయంలో ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వ్యవహరించిన నవీన్‌ చావ్లా శైలిని, ఆ సమయంలో ఢిల్లీలో జరిగిన అకృత్యాలు, దౌర్జన్యాలు, బలవంతపు కుటుంబ నియంత్రణ అమలులో ఆయన పాత్రను సాక్షాత్తు ‘షా కమిషన్‌’ తప్పుబట్టిన విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నవీన్‌ చావ్లాను తదనంతర కాలంలో ఇందిరా గాంధీ హయాంలో ఎన్నికల కమిషనర్‌గా నియమించి పక్షపాతంగా వ్యవహరించారని, అప్పటి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఎన్‌. గోపాలస్వామి కూడా ఆయనపై 12 అభియోగాలు మోపి తప్పుబట్టిన చరిత్ర దేశానికి తెలుసన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టిండర్‌లో టెండర్‌.. ఖాతాల్లో రూ.8.26 కోట్లు గాయబ్‌!

‘సింగిల్‌ పర్మిట్‌’ అమలు చేయండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 05:53 AM