మత్తుమందిచ్చి ఉద్యోగినిపై లైంగికదాడి!
ABN , Publish Date - Sep 26 , 2026 | 06:52 AM
ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగిపై అక్కడ ఫుడ్‌వెండర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ ఫొటోలు, వీడియోల ఆధారంగా బ్లాక్‌మెయిల్
మూడేళ్లపాటు వేధింపులు.. పలుమార్లు రేప్
నిందితుడి అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు
రాయదుర్గం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగిపై అక్కడ ఫుడ్‌వెండర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘోరాన్ని ఫొటోలు తీసి, వీడియోలుగా చిత్రీకరించి.. పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు రాయదుర్గం పరిధిలోని ఓ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్‌లో పనిచేస్తున్న ఉద్యోగిని. అక్కడ ఫుడ్‌వెండర్‌గా పనిచేస్తున్న షేక్‌నబీ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. తనతో కలిసి రెస్టారెంట్ వ్యాపారం నిర్వహిస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పిన ఆ మహిళ నుంచి నబీ రూ.43 లక్షలు తీసుకున్నాడు.
అతడు కంపెనీ సమీపంలోనే బాక్స్ క్రికెట్ నిర్వహించేవాడు. 2023లో కంపెనీ ఉద్యోగులు అక్కడ క్రికెట్ ఆడాక పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో బాధితురాలితో మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించిన నబీ, ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకున్యాక అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెకు ఆ వీడియోలు, ఫొటోలను చూపిస్తూ తన కోరిక తీర్చకపోతే వాటిని భర్త, పిల్లలకు, బంధువులకు పంపుతానని బెదిరించి 2026 ఆగస్టు వరకు పలుమార్లు అత్యాచారం చేశాడు. అతడి వేధింపులు పెరిగిపోవడంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పి అనంతరం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నబీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బడా గణేశా.. బుడతడిని బతికించవూ!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News