Share News

హైదరాబాద్‌ ఆస్పత్రిలో డాక్టర్ వేషధారణలో చోరీ.. మత్తు మందు ఇచ్చి మరీ..

ABN , Publish Date - Mar 13 , 2026 | 11:00 AM

సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విచిత్రమైన చోరీ ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ వేషధారణలో ఓ ఆగంతకురాలు రోగి వద్ద ఉన్న విలువైన బంగారు ఆభరణాలను కాజేసి పారిపోయింది.

హైదరాబాద్‌ ఆస్పత్రిలో డాక్టర్ వేషధారణలో చోరీ.. మత్తు మందు ఇచ్చి మరీ..
Hospital Theft

సికింద్రాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విచిత్రమైన చోరీ ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ వేషధారణలో ఓ ఆగంతకురాలు రోగి వద్ద ఉన్న విలువైన బంగారు ఆభరణాలను కాజేసి పారిపోయింది. ఈ సంఘటన ఆస్పత్రి సిబ్బందిని షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


డాక్టర్ వేషధారణలో వచ్చి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనారోగ్య సమస్యలతో ఇటీవల ఓ ఆస్పత్రిలో బోయిన్‌పల్లికి చెందిన ఓ రోగి చేరారు. ఆస్పత్రిలో చేరిన వెంటనే గైనకాలజీ డాక్టర్ కోసం రోగి వేచి ఉంది. ఆ సమయంలో ఓ గుర్తుతెలియని మహిళ బాధితురాలి నగలను దోచేసింది. వైద్య పరీక్షల కోసం వేచి ఉన్న సమయంలో, డాక్టర్ వేషధారణలో వచ్చిన ఆగంతుకురాలు, బాధితురాలి వద్ద ఉన్న నర్సులను బయటకు పంపించి, ఆమెకు మత్తుమందు ఇచ్చింది. ఆ సమయంలో ఆగంతకురాలు బాధితురాలి దగ్గర ఉన్న పది తులాల బంగారు ఆభరణాలను తీసుకుని పారిపోయింది. ఆస్పత్రి సిబ్బందికి కూడా ఈ సంఘటన షాక్‌కు గురిచేసింది. సాధారణంగా ఆస్పత్రిలో రోగి భద్రతపై ఎక్కువ శ్రద్ధ ఉంటుందని అనుకుంటారు, కానీ డాక్టర్ వేషధారణలో వచ్చిన ఆగంతకురాలు ఇలా రోగిని మత్తుమందు ఇచ్చి ఆభరణాలు తస్కరించడం ఆశ్చర్యంగా ఉందని సిబ్బంది తెలిపారు.


పోలీసుల చర్యలు..

బాధితురాలి నగల చోరీపై ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగంతకురాలిని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. ఆస్పత్రి సిబ్బందిని పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే: సీఎం రేవంత్‌రెడ్డి

ఢిల్లీ మద్యం కేసు.. కవితకు సీబీఐ నోటీసులు

ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 13 , 2026 | 12:08 PM