Share News

నన్ను ఇప్పటికీ బీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేగానే గుర్తిస్తోంది: దానం నాగేందర్

ABN , Publish Date - Sep 21 , 2026 | 06:17 PM

దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు తనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నన్ను ఇప్పటికీ బీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేగానే గుర్తిస్తోంది: దానం నాగేందర్
Danam Nagender

ఢిల్లీ, సెప్టెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు తనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ (SLP) దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు. తనను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేగానే గుర్తిస్తోందని స్పష్టంచేశారు.


మరో పార్టీ నుంచి లోక్‌సభకు పోటీ చేసినంత మాత్రన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు కాదని దానం నాగేందర్ తెలిపారు. శాసనసభలో బీఆర్ఎస్ బలం 38 అని మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారని, తనను క్రమశిక్షణా చర్యల కింద తొలగించలేదని వెల్లడించారు. స్పీకర్ ఇచ్చిన సమగ్ర తీర్పును సరిగ్గా సమీక్షించకుండానే.. తెలంగాణ హైకోర్టు రద్దు చేసిందని దానం ఆరోపించారు.


కాగా, తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను (SLP) దానం నాగేందర్ దాఖలు చేశారు. నామినేషన్ వేసిన నాటి నుంచే అనర్హత వర్తిస్తుందని హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లారు. ఈ పిటిషన్‌పై దానం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం బుధవారం(సెప్టెంబర్ 23) విచారణ జరపనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం: బండి సంజయ్

కేసీఆర్, రేవంత్ నయా నిజాంలు.. ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 07:36 PM