రాహుల్ గాంధీ పుట్టినరోజున గాంధీభవన్‌లో భారీ జాబ్‌మేళా
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:35 PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 19వ తేదీన గాంధీభవన్‌లో భారీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 100 కంపెనీలు గాంధీ భవన్‌కు వస్తున్నాయని వివరించారు.
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పుట్టినరోజు సందర్భంగా ఈనెల 19వ తేదీన గాంధీభవన్‌లో భారీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ (Congress MP Anil Kumar Yadav) తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 100 కంపెనీలు గాంధీ భవన్‌కు వస్తున్నాయని వివరించారు. నిరుద్యోగ యువత అందరూ ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు (ఆదివారం) గాంధీభవన్‌లో మీడియాతో ఎంపీ అనిల్ మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లక్షమందికి వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించిందని ప్రస్తావించారు. విద్యార్థుల జీవితంతో ఆడుకుంటున్న కేంద్రంపై రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని తెలిపారు.
కేంద్రప్రభుత్వం పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల జీవితాలతో అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఏడాదికి దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అన్నారని.. కానీ ఉన్న ఉద్యోగాలను కూడా తీసేస్తున్నారని ఆగ్రహించారు. మోదీ 12ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆయన దేశానికి ఏమి చేశారని సంబరాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావు చేసిన అభివృద్ధికి పేరు మార్చి మోదీ భజన చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ కుటుంబంలో అందరూ వెన్నుపోటు దారులేనని ఆక్షేపించారు. ఎవరూ వెన్నుపోటు పొడుస్తున్నారో ప్రజలకు తెలుసునని ఎంపీ అనిల్ యాదవ్ ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆపరేషన్ సిందూర్ విజయంలో ఎయిర్ వారియర్స్‌ది కీలక పాత్ర: రాజ్‌నాథ్ సింగ్
వీబీజీ రాంజీ స్కీంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం: మంత్రి సీతక్క
‘సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. కేటీఆర్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News