Share News

రైతుల పేరుతో దుష్ప్రచారం చేయొద్దు.. కేటీఆర్‌కి.. ఆది శ్రీనివాస్ వార్నింగ్

ABN , Publish Date - May 31 , 2026 | 05:42 PM

మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్య‌వ‌సాయానికి మూడు గంట‌ల విద్యుత్ స‌రిపోతుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్న‌ట్లుగా కేటీఆర్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం ఆ మాట ఎప్పుడు ఆన‌లేదని తేల్చిచెప్పారు.

రైతుల పేరుతో దుష్ప్రచారం చేయొద్దు.. కేటీఆర్‌కి.. ఆది శ్రీనివాస్ వార్నింగ్
Adi Srinivas

హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్‌పై (KTR) తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్య‌వ‌సాయానికి మూడు గంట‌ల విద్యుత్ స‌రిపోతుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్న‌ట్లుగా కేటీఆర్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం ఆ మాట ఎప్పుడు ఆన‌లేదని తేల్చిచెప్పారు. ఈరోజు (ఆదివారం) గాంధీభవన్‌లో ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తమ హ‌యాంలో 24 గంట‌ల ఉచిత విద్యుత్ ఇచ్చామ‌ని కేటీఆర్ బ‌డాయి క‌బుర్లు చెపుతున్నారని విమర్శించారు. కేసీఆర్ హ‌యాంలో 12 గంట‌ల క‌రెంట్ మాత్ర‌మే ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కు అని వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్‌పైన తొలి సంత‌కం చేసింది అప్పటి కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డినే అని ప్రస్తావించారు.


కేసీఆర్ హ‌యాంలో 24 గంట‌ల ఉచిత విద్యుత్ ఇవ్వ‌లేదు..

రైతును రాజు చేయాల‌నే ఆలోచ‌న‌తోనే కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ఇచ్చిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. కేసీఆర్ హ‌యాంలో ఏనాడు వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల ఉచిత విద్యుత్ ఇవ్వ‌లేదని అన్నారు. గ‌త యాసంగి సీజ‌న్‌లో విద్యుత్ ఇవ్వ‌లేద‌ని ఏ స‌బ్‌స్టేష‌న్ ద‌గ్గ‌ర చిన్న ధ‌ర్నా కూడా జ‌ర‌గ‌లేదని.. అది తమ నిబ‌ద్ధత‌ అని చెప్పారు. నాణ్య‌మైన విద్యుత్‌ను ఎలాంటి అంత‌రాయాలు లేకుండా తమ ప్ర‌భుత్వం స‌రఫరా చేస్తోందని అన్నారు. తమ ప్ర‌భుత్వం రైతు డిస్కం పెడితే కేటీఆర్‌కు అంత నొప్పి ఎందుకుని ప్రశ్నించారు. రైతు ప్ర‌యెజ‌నాల కోస‌మే తమ ప్రభుత్వం డిస్కం ఏర్పాటు చేసిందని ప్రస్తావించారు. మోటార్ల‌కు మీట‌ర్లు పెట్ట‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారని పేర్కొన్నారు.


కేటీఆర్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు..

మోటార్ల‌కు మీట‌ర్లు పెడితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌మ‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారని.. అయినా కేటీఆర్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని ఆది శ్రీనివాస్ ఆగ్రహించారు. ఒకవేళ తాము మీట‌ర్లు పెట్ట‌క‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పోటీ చేయ‌దా..? అని సీఎం ఛాలెంజ్ చేశారని అన్నారు. సీఎం స‌వాల్‌ను కేటీఆర్ ఎందుకు స్వీక‌రించ‌డం లేదు..? అని నిలదీశారు. రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నాలను ఆయన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ ప్ర‌భుత్వం రైతుల ప‌క్షాన నిల‌బ‌డుతుందని స్పష్టం చేశారు. కేటీఆర్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే కాంగ్రెస్ ల‌క్ష‌లాది మంది కార్య‌క‌ర్త‌లు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఇప్పటికైనా రైతుల విష‌యంలో కేటీఆర్ దుష్ప్రచారం మానుకోవాలని ఆది శ్రీనివాస్ హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. క్రమశిక్షణ కమిటీ విచారణ

సీఎం.. జేబులో కత్తెర, రిబ్బన్‌తో తిరుగుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - May 31 , 2026 | 05:54 PM