ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jan 30 , 2026 | 07:22 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jan 30, 2026 21:34 IST
పసిడి ప్రియులకు పండగలాంటి వార్త..
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,80,779 దగ్గర ట్రేడ్ అయింది..
అలాగే కిలో వెండి ధర నిన్న రూ.4,20,048 దగ్గర ట్రేడ్ అయింది..
నేటి ధరల విషయానికొస్తే..
-
Jan 30, 2026 21:19 IST
కర్ణాటకలో భారీగా డ్రగ్స్ పట్టుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
మైసూర్‌లో క్లండస్టిన్ మాదకద్రవ్యం తయారుచేసే ల్యాబ్ సీజ్.
మార్కెట్‌లో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.25.60 లక్షలు సీజ్.
డ్రగ్స్ తయారీకి వాడే 500 కిలోల రసాయనాలు సీజ్ చేసిన ఎన్‌సీబీ.
-
Jan 30, 2026 21:17 IST
అమరావతిలో కీలక ముందడుగు
బిట్స్ పిలానీ క్యాంపస్ నిర్మాణానికి ఒప్పందం.
70.011 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటుకు CRDAతో ఒప్పందం.
-
Jan 30, 2026 20:49 IST
నల్లగొండ: మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు.
3 వార్డులకు ఎమ్మెల్యే సతీమణి, కుమారులు నామినేషన్లు.
39వ వార్డు నుంచి ఎమ్మెల్యే సతీమణి బత్తుల మాధవి.
40వ వార్డు నుంచి ఎమ్మెల్యే పెద్ద కుమారుడు బత్తుల సాయిప్రసన్న.
28వ వార్డు నుంచి రెండో కుమారుడు ఈశ్వర్ గణేష్ నామినేషన్.
కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు.
-
Jan 30, 2026 20:06 IST
పల్నాడు: మాజీ మంత్రి విడదల రజనీకి నిరసన సెగ.
యడ్లపాడు మండలం బోయపాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన రజనీ.
దేవాలయం వద్దకు చేరుకుని గో బ్యాక్ రజనీ అంటూ గ్రామస్తుల నినాదాలు.
వెంకన్న ప్రసాదాన్ని కల్తీ చేసిన వాళ్లు తమ దేవాలయానికి రావొద్దంటూ నినాదాలు.
నిరసనల మధ్య కారులో సైలెంట్‌గా వెళ్లిపోయిన రజనీ, వైసీపీ నేతలు.
-
Jan 30, 2026 20:02 IST
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా సునేత్రా పవార్..?
దివంగత నాయకుడు అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం.
శనివారం నాడు ఆమె డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అధికారిక వర్గాల సమాచారం.
-
Jan 30, 2026 19:53 IST
కర్నూలు : ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు రమేష్‌పై హత్యాయత్నం.
తుగ్గలి మండలం బొందిమడుగులలో దుండగుల దాడి.
వాకింగ్ చేస్తుండగా ట్రాక్టర్‌తో ఢీకొని ఇనుప రాడ్‌లతో దాడి చేసిన దుండగులు.
పరిస్థితి విషమం, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలింపు.
-
Jan 30, 2026 19:50 IST
నెల్లూరు: రాపూరులో అలుగు విక్రయాన్ని అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు
DRI, రాపూరు అటవీశాఖ అధికారులకు చిక్కిన ఆరుగురు నిందితులు.
-
Jan 30, 2026 19:14 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ మరో నోటీసు
విచారణకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలన్న సిట్.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్.
-
Jan 30, 2026 18:52 IST
కాసేపట్లో కేసీఆర్‌కు సిట్ నోటీసులు..
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్ అధికారులు.
-
Jan 30, 2026 18:41 IST
పల్నాడు: పిగుడురాళ్లలో ఉద్రిక్తత
తిరుమల లడ్డూలో రసాయనాల వ్యవహారంపై ఫ్లెక్సీలు ఏర్పాటు.
ర్యాలీగా వచ్చి ఫ్లెక్సీలను చించివేసిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి.
వైసీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులతో వైసీపీ నేతల వాగ్వాదం, తోపులాట.
టీడీపీ, వైసీపీ కార్యాలయాల వద్దకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు.
-
Jan 30, 2026 18:35 IST
సాగునీటి ప్రాజెక్ట్‌లపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదు: ఉత్తమ్
తెలంగాణకు రావాల్సిన నీటి విషయంలో రాజీ పడేది లేదు: ఉత్తమ్
పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వలేదని కేంద్రం చెప్పింది.
-
Jan 30, 2026 18:34 IST
ఢిల్లీ: రికార్డు స్థాయికి భారత విదేశీ కరెన్సీ నిల్వలు
8.053 బిలియన్ డాలర్లు పెరిగిన విదేశీ మారక ద్రవ్యం.
709.413 బిలియన్ డాలర్లతో ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరిక.
-
Jan 30, 2026 18:33 IST
ఢిల్లీ పర్యటనలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను కలిసిన అశోక్ గజపతి రాజు.
రేపు రాష్ట్రపతి, ప్రధానిని కలిసే అవకాశం.
-
Jan 30, 2026 18:00 IST
తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం
రేపు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు ఫిబ్రవరి 3 గడువు.
116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు.
ఫిబ్రవరి 11న ఎన్నికలు, 13న కౌంటింగ్.
ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే ఫిబ్రవరి 12న నిర్వహణ.
-
Jan 30, 2026 17:49 IST
కేసీఆర్ మరోసారి సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం..
న్యాయ నిపుణులతో చర్చించిన సిట్.
కేసీఆర్‌ను ఎక్కడ విచారణ జరపాలనే అంశంపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన సిట్.
-
Jan 30, 2026 17:42 IST
తెలంగాణ IPS అధికారుల సంఘానికి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి క్షమాపణలు
పోలీసులు, అధికారులంటే నాకు ఎంతో గౌరవం: కౌశిక్‌రెడ్డి
ఫ్రస్ట్రేషన్‌లో తెలియకుండా నోరు జారా: కౌశిక్‌రెడ్డి
ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదు: కౌశిక్‌రెడ్డి
వివాదాన్ని ఇంతటితో ముగించాలని కోరుతున్నా: కౌశిక్‌రెడ్డి
-
Jan 30, 2026 16:59 IST
ఢిల్లీ: సంచార్ సాథీ యాప్‌తో 1.52 కోట్ల మొబైల్ నంబర్లు బ్లాక్
చట్ట వ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు గుర్తింపు.
సైబర్ మోసాల నియంత్రణకు సంచార్ సాథీ యాప్ తెచ్చిన కేంద్రం.
సంచార్ సాథీ యాప్‌నకు వినియోగదారుల నుంచి విశేష స్పందన.
ఇప్పటివరకు 2 కోట్లకు మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు వెల్లడి.
-
Jan 30, 2026 16:47 IST
ఫిబ్రవరి 3న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం.
ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంత్రిమండలి సమావేశం.
కేబినెట్ భేటీలో తిరుమల లడ్డూ కల్తీ అంశంపై చర్చించే అవకాశం.
-
Jan 30, 2026 16:45 IST
హరీష్‌రావు హరికథలు కాదు.. నిజాలు కావాలి: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు తీరని నష్టం చేశారు.
నీళ్ల పేరుతో గత పాలకులు రాష్ట్రాన్ని దోచుకున్నారు.
బీఆర్ఎస్ పాలకులు జేబులు నింపుకునేందుకే ప్రాజెక్టులు కట్టారు.
-
Jan 30, 2026 16:40 IST
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తీరును ఖండించిన తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం.
కౌశిక్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్.
పోలీసు అధికారులపై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు నిరాధారం.
ఎస్పీ మతాన్ని ప్రస్తావిస్తూ అక్కడివారి మనోభావాలను దెబ్బతీసేలా కౌశిక్‌రెడ్డి వ్యవహరించారు.
ఇది సివిల్ సర్వీసెస్ అధికారుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటమే.
-
Jan 30, 2026 16:25 IST
విశాఖపట్నం: నాపై దాడి వెనుక బొత్స పాత్ర ఉందని భావిస్తున్నా: మేయర్ శ్రీనివాసరావు
జీవీఎంసీ కౌన్సిల్‌లో బొత్స సత్యనారాయణ తీరు బాగోలేదు.
నా మీద దాడి చేయడానికే వైసీపీ సభ్యులు కౌన్సిల్‌కు వచ్చారు.
నాపై ముగ్గురు వైసీపీ సభ్యులు దాడికి ప్రయత్నం చేశారు.
వారిని సస్పెండ్ చేశాము.
నాపై దాడి వెనుక బొత్స పాత్ర ఉందని భావిస్తున్నాను.
-
Jan 30, 2026 16:22 IST
చిత్తూరు: కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.
సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు.
కుప్పం స్థానిక నేతలను అప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి.
అగస్త్య విద్యాచల్ అకాడమీ ఆధ్వర్యంలోని టీచర్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం.
-
Jan 30, 2026 16:13 IST
విజయవాడ: మద్యం కుంభకోణంలో ఐదుగురు నిందితులకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు.
విజయవాడ జైలులో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బూనేటి చాణక్య, అనిల్ చోక్ర.
గుంటూరు జైల్లో ఉన్న బాలాజీ కుమార్ యాదవ్, రోణక్ కుమార్.
వీరి రిమాండ్ ముగియడంతో ఏసీబీ కోర్టులో హాజరు పరిచిన పోలీసులు.
ఫిబ్రవరి 13 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు.
-
Jan 30, 2026 15:56 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
296 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్.
98 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ.
-
Jan 30, 2026 15:38 IST
కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

సిట్ క్లీన్‌చిట్ ఇచ్చిందని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు: బీఆర్ నాయుడు
హిందువుల మనోభావాలు దెబ్బతీశారు: బీఆర్ నాయుడు
గత పాలకమండలిలో అనేక అవకతవకలు జరిగాయి: బీఆర్ నాయుడు
నిబంధనలు ఏమాత్రం పాటించలేదు: బీఆర్ నాయుడు
ఎన్నో అరాచకాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారు: బీఆర్ నాయుడు
సామర్థ్యం లేని డెయిరీకి 60 లక్షల కేజీల నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారు: బీఆర్ నాయుడు
రూ.250 కోట్ల అవినీతికి పాల్పడ్డారు: బీఆర్ నాయుడు
-
Jan 30, 2026 15:28 IST
పార్క్ చేసిన 15 సెకండ్లలో వాహనం చోరీ
సీసీ కెమెరాల్లో రికార్డైన చోరీ దృశ్యాలు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.
హైదరాబాద్‌లోని బాలాపూర్ ఎక్స్‌రోడ్డులో చోటు చేసుకున్న ఘటన.
-
Jan 30, 2026 15:23 IST
విద్యాసంస్థల్లో టాయిలెట్లు, వసతులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దివ్యాంగులకు అనుకూలమైన ప్రత్యేక టాయిలెట్లు ఉండాలి: సుప్రీంకోర్టు
స్కూళ్లలో బాలికలకు శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉంచాలి: సుప్రీంకోర్టు
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు.
-
Jan 30, 2026 15:21 IST
తెలంగాణ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల
టెట్ 2026 జనవరి ‘కీ’ ని విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.
టెట్ ‘కీ’పై అభ్యంతరాలను స్వీకరించనున్న పాఠశాల విద్యాశాఖ.
ఫిబ్రవరి 1 వరకు అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం.
ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ.
-
Jan 30, 2026 15:16 IST
ఢిల్లీ: కేంద్ర జల వివాదాల కమిటీ సమావేశం
సిడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన భేటీ.
హాజరైన తెలుగురాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు.
కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లు, ఇతర ఉన్నతాధికారులు.
-
Jan 30, 2026 14:53 IST
కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి కేటీఆర్..
సిద్దిపేట: ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
ఇప్పటికే ఫాంహౌస్‌కు చేరుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..
ఇద్దరు నేతలతో సమావేశం కానున్న మాజీ సీఎం కేసీఆర్..
సిట్ నోటీసుల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ..
-
Jan 30, 2026 14:50 IST
సమ్మక్క సారలమ్మ సేవలో గవర్నర్..
ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ సేవలో గవర్నర్ బిష్ణుదేవ్ శర్మ..
సతీసమేతంగా అమ్మవార్లను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్న గవర్నర్..
-
Jan 30, 2026 14:48 IST
మున్సిపల్ ఎన్నికలకు భారీగా దాఖలవుతున్న నామినేషన్లు..
నిజామాబాద్: మున్సిపల్ ఎన్నికలకు భారీగా దాఖలవుతున్న నామినేషన్లు..
కార్పొరేషన్‌లోని 20 కేంద్రాల వద్ద బారులుతీరిన దరఖాస్తుదారులు..
చివరిరోజు కావడంతో దరఖాస్తు చేయడానికి తరలివస్తున్న ఆశావహులు..
ఇప్పటికీ అభ్యర్థుల జాబితా ప్రకటించని ప్రధాన పార్టీలు..
ఎవరికి వారే ధీమాతో నామినేషన్లు..
-
Jan 30, 2026 14:43 IST
డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం..
విశాఖ కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం.
సమావేశానికి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల అధికారులు హాజరు.
భేటీలో పాల్గొన్న పంచాయతీరాజ్, డోమా ఆర్‌డబ్ల్యూఎస్, పీసీబీ అధికారులు.
-
Jan 30, 2026 14:41 IST
ఆర్‌ఎస్ఎస్‌కు రాజకీయాలతో సంబంధం లేదు: మోహన్ భగవత్
విజయవాడ: ఆర్‌ఎస్ఎస్‌కు రాజకీయాలతో సంబంధం లేదు: మోహన్ భగవత్
RSSలో ప్రభుత్వ ఉద్యోగులు చేరకూడదని కొన్ని ప్రభుత్వాలు నిషేధం విధించాయి..
ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు..
భారత్‌లో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే: మోహన్ భగవత్
-
Jan 30, 2026 14:35 IST
మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే నోటీసులు: డీకే అరుణ
మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేసీఆర్‌కు సిట్ నోటీసులు: ఎంపీ డీకే అరుణ
సిట్ నోటీసులు.. మరో ఎన్నికల స్టంట్ మాత్రమే..
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. ఏ పార్టీలో ఉన్నారో స్పీకర్ స్పష్టం చేయాలి..
నాడు బీఆర్ఎస్ చేసిన ఫిరాయింపులను.. నేడు కాంగ్రెస్ చేస్తోంది: ఎంపీ డీకే అరుణ
-
Jan 30, 2026 14:32 IST
ఈఏపీసెట్ షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 14న నోటిఫికేషన్
తెలంగాణ ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్.
ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ.
మే 4, 5వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు.
మే 9 నుంచి జూన్ 11 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్ష.
-
Jan 30, 2026 13:43 IST
చదువు అనేది గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
మనం మాత్రమే కాదు.. సమాజం కూడా బాగుండాలనేది మన సంస్కృతి: సీఎం చంద్రబాబు
చైతన్యం పెరిగి సేవా కార్యక్రమాలకు చాలా మంది సహాయపడుతున్నారు: చంద్రబాబు
ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుంటుంది: సీఎం చంద్రబాబు
చదువు అనేది గేమ్ ఛేంజర్.. సరైన సమయంలో నిర్ణయాలు ఉండాలి: చంద్రబాబు
-
Jan 30, 2026 13:18 IST
అమరావతి: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి: మంత్రి లోకేష్
పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేయండి: మంత్రి నారా లోకేష్
కూటమి నేతల మధ్య సఖ్యత ముఖ్యం.. కలిసికట్టుగా పనిచేయండి: లోకేష్
దుష్ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టండి: మంత్రి నారా లోకేష్
-
Jan 30, 2026 12:48 IST
కేసీఆర్‌కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు: BRS న్యాయవాది మోహిత్‌రావు
రాజకీయ కక్షసాధింపులో భాగంగానే సిట్ నోటీసులు: మోహిత్‌రావు
గతంలో ఇలాంటి కేసులను సుప్రీంకోర్టు కొట్టేసింది: న్యాయవాది మోహిత్‌రావు
అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం: BRS న్యాయవాది మోహిత్‌రావు
-
Jan 30, 2026 12:47 IST
విచారణకు అడ్వకేట్‌ను పంపిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
క్రాస్ ఎగ్జామినేషన్‌కు వ్యక్తిగతంగా హాజరుకావడానికి..
ఫిబ్రవరి 20 వరకు గడువు కోరిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సాక్ష్యాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేసిన మహేశ్వర్‌రెడ్డి
-
Jan 30, 2026 12:45 IST
కేసీఆర్‌కు మరోసారి నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయం
నోటీసులు ఇచ్చే అంశంపై సిట్ అధికారుల భేటీ
కేసీఆర్‌ను హైదరాబాద్‌లోనే విచారించాలని సిట్ యోచన
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ప్రశ్నించే అవకాశాలు లేవంటున్న సిట్
-
Jan 30, 2026 12:44 IST
దానంపై అనర్హత వేటు వేయాలని కోరా: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చా: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
నాపై ఓవరాక్షన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరా: కౌశిక్‌రెడ్డి
న్యాయం జరిగే వరకు అధికారులను వదిలిపెట్టను: కౌశిక్‌రెడ్డి
-
Jan 30, 2026 12:24 IST
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ స్వాత్ కమాండో కాజల్ చౌదరి దారుణ హత్య
భర్త అంకుర్ చౌదరి చేతిలో దారుణ హత్యకు గురైన కాజల్ చౌదరి
భార్యను హత్య చేస్తూ ఆమె సోదరుడికి ఫోన్ చేసిన నిందితుడు
హత్య అనంతరం శవాన్ని తీసుకెళ్లాలంటూ ఆమె సోదరుడికి చెప్పిన అంకుర్
అదనపు కట్నం కోసం వేధిస్తూ హత్య చేసిన భర్త అంకుర్ చౌదరి
-
Jan 30, 2026 12:17 IST
కరీంనగర్: వీణవంక మినీ మేడారం జాతరపై క్లారిటీ ఇచ్చిన నిర్వాహకులు
1976లో మా తాత పాడి సుధాకర్‌రెడ్డి మినీ మేడారం ప్రారంభించారు: ఉదయనందన్‌రెడ్డి
50 ఏళ్లుగా మా కుటుంబమే జాతర చేస్తుంది: ఉదయనందన్‌రెడ్డి
MLA కౌశిక్‌రెడ్డి కావాలనే గొడవ చేశారు: ఉదయనందన్‌రెడ్డి
జాతరతో ఎండోమెంట్‌కు సంబంధం లేదు: ఉదయనందన్‌రెడ్డి
-
Jan 30, 2026 12:15 IST
అహ్మదాబాద్‌లో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్ ఏజెంట్ రోషన్ అగర్వాల్ సహా నలుగురి అరెస్ట్
అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు శిశువును తరలిస్తున్న ముఠా
వాహన తనిఖీల్లో బయటపడ్డ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా బాగోతం
శిశువును రూ.3.60లక్షలకు కొనుగోలు చేసిన ఏజెంట్ రోషన్
-
Jan 30, 2026 12:15 IST
ములుగు: మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు
రాత్రి పలుచోట్ల కరెంట్ పోవడంతో భక్తులు ఆగ్రహం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కారు అద్దాలు, పలు దుకాణాలు ధ్వంసం
-
Jan 30, 2026 12:14 IST
అనర్హత వేటు వేస్తారని ఆశిస్తున్నాం: కౌశిక్‌రెడ్డి
దానం నాగేందర్‌పై స్పీకర్ అనర్హత వేటు వేస్తారని ఆశిస్తున్నాం: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
దానం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు: కౌశిక్ రెడ్డి
దానం పోటీ చేసిన దాని కంటే పెద్ద ప్రూఫ్ ఏముంటుంది?: కౌశిక్‌రెడ్డి
-
Jan 30, 2026 12:11 IST
దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై స్పీకర్ ఛాంబర్‌లో విచారణ
దానంపై అనర్హత కోరుతూ రెండు పిటిషన్లు దాఖలు
కౌశిక్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ ప్రారంభించిన స్పీకర్
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ
కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న దానం అడ్వకేట్లు
తాను BRSలోనే ఉన్నానని ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన దానం
-
Jan 30, 2026 12:09 IST
జనవరి 30న భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి
మహాత్మా వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు
మహాత్ముని త్యాగాలు, ఆశయాలను స్మరించుకుంటూ ట్వీట్ చేసిన సీఎం
అహింసా విధానంతో కోట్లమందిని ఒక్కతాటిపైకి తెచ్చిన మహాత్ముడు గాంధీ: సీఎం చంద్రబాబు
ఆయన బోధనలైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్ధాంతాలు అందరూ పాటించాలి: సీఎం చంద్రబాబు
-
Jan 30, 2026 11:55 IST
మహాత్మకు నివాళి
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
మహాత్ముని త్యాగాలను, ఆశయాలను స్మరించుకున్న ముఖ్యమంత్రి రేవంత్
ఎక్స్ వేదికగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
-
Jan 30, 2026 11:48 IST
ఢిల్లీ: నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి
గాంధీజీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ
1948 జనవరి 30న ఢిల్లీ బిర్లా భవన్ వద్ద నాథూరాం గాడ్సే చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన గాంధీ
జాతిపిత మహాత్మా గాంధీకి హృదయపూర్వక నివాళులు: ప్రధాని మోదీ
పూజ్య బాపు ఎల్లప్పుడూ స్వదేశీని నొక్కిచెప్పారు: ప్రధాని మోదీ
గాంధీజీ వ్యక్తిత్వం, విజయాలు ఎల్లప్పుడూ విధి మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపిస్తాయి: ప్రధాని మోదీ
-
Jan 30, 2026 10:49 IST
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్
అమరావతి: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ సర్కార్
జాబ్ క్యాలెండర్‌పై కసరత్తు ముమ్మరం చేసిన కూటమి ప్రభుత్వం
వివిధ శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తున్న చంద్రబాబు సర్కార్
పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
-
Jan 30, 2026 10:21 IST
గుడ్ న్యూస్.. తగ్గుముఖం పట్టిన బంగారం ధర
కొన్ని రోజులుగా అంచనాలకు మించి పెరిగిన బంగారం ధర
నేడు ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే యూటర్న్ తీసుకున్న గోల్డ్ ధర
-
Jan 30, 2026 08:51 IST
స్నేహితుడిని అవమానించిన యువతి..
చిన్ననాటి స్నేహితుడు డెలివరీ బాయ్‌గా మారాడని అవమానించిన యువతి
దారుణంగా అవమానిస్తున్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్
అప్పట్లో అందరూ బాగా చదువుకోవాలని చెప్పి ఇప్పుడు అతనే డెలివరీ బాయ్ అయ్యాడంటూ విమర్శ
వీడియో తీసి నెట్టింట పోస్టు చేసిన యువతి.. ఆమెపై ఫైర్ అవుతున్న నెటిజన్లు
-
Jan 30, 2026 08:22 IST
కేసీఆర్‌కు మరో నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైన సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేడు మినహాయింపు
రేపు విచారణ కోసం మరో నోటీస్ సిద్ధం చేసిన సిట్
నోటీస్ ఎక్కడిస్తారనే దానిపై సందిగ్ధత
-
Jan 30, 2026 08:06 IST
పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
కరీంనగర్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
కరీంనగర్ సీపీని మతం పేరుతో దూషించారని కౌశిక్‌రెడ్డిపై కేసు
వీణవంకలో సమ్మక్క జాతరకు వెళ్తుండగా కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
సమ్మక్క జాతర దగ్గర పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కౌశిక్‌రెడ్డి
పోలీసులను నెట్టేసి.. సీపీపై అనుచిత వ్యాఖ్యలు
-
Jan 30, 2026 08:05 IST
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ప్రకాశం: అమ్మనబ్రోలు దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
పట్టాలు తప్పి పక్క లైన్లపై పడ్డ గూడ్స్ వ్యాగన్లు
ఘటనాస్థలిలో కొనసాగుతున్న మరమ్మతులు
నాగులుప్పలపాడు మం. అమ్మనబ్రోలు దగ్గర ఘటన
-
Jan 30, 2026 07:35 IST
దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం 6.00 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,886
22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి రేటు రూ.1,63,960
విజయవాడ, విశాఖపట్నంలోనూ దాదాపు ఇదే రేటు
చెన్నైలో అత్యధికంగా 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,83,290
22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,68,010
-
Jan 30, 2026 07:30 IST
హైదరాబాద్: ఫిరాయింపుల కేసులో నేడు దానం నాగేందర్ విచారణ
దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని రెండు పిటిషన్లు
పిటిషన్లు దాఖలు చేసిన కౌశిక్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న దానం అడ్వొకేట్లు
తాను BRSలోనే ఉన్నానని ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన దానం
-
Jan 30, 2026 07:28 IST
నేడే తుదిగడువు
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లకు నేడు తుదిగడువు
సాయంత్రం 5గంటలకు ముగియనున్న నామినేషన్ల గడువు
రేపు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
-
Jan 30, 2026 07:28 IST
వెనెజువెలా గ్రీన్ సిగ్నల్..
చమురు రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు వెనెజువెలా ఆమోదం
ప్రభుత్వ నియంత్రణకు స్వస్తి, ఫలించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి
తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ సంతకంతో చట్టంగా మారిన బిల్లు
-
Jan 30, 2026 07:27 IST
మహాత్ముడి వర్ధంతి నేడే..
నేడు మహాత్మాగాంధీ 78వ వర్ధంతి
రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించనున్న రాష్ట్రపతి, ప్రధాని
-
Jan 30, 2026 07:24 IST
మేడారానికి ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు
వనదేవతల దర్శనానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
అమ్మవార్ల దర్శనానికి 4గంటలకు పైగా సమయం
-
Jan 30, 2026 07:23 IST
నేడు తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు
సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీ నేతృత్వంలో ఎన్నికలు
బరిలో 203మంది న్యాయవాదులు, అందులో 55 మంది మహిళలు
తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లుగా 35,316 మంది న్యాయవాదులు
-
Jan 30, 2026 07:23 IST
చెన్నై: టీవీకే మేనిపెస్టో కమిటీ పర్యటన ఖరారు
ఫిబ్రవరి 1న మదురై నుంచి కమిటీ పర్యటన ప్రారంభం
ప్రభుత్వేతర సంస్థలు, సామాజిక కార్యకర్తలతో భేటీ
ప్రజల అభిప్రాయాలను తీసుకోనున్న టీవీకే కమిటీ
ఫిబ్రవరి 2న టీవీకే మూడో వార్షికోత్సవం
-
Jan 30, 2026 07:22 IST
అనంతపురం: యాడికిలో గంజాయి బ్యాచ్ వికృత చేష్టలు
లిక్కర్ షాప్ దగ్గరకు అర్ధనగ్నంగా వచ్చిన గుత్తికి చెందిన రౌడీషీటర్ అజయ్ గ్యాంగ్
లిక్కర్ షాప్‌లో మద్యం కొని అక్కడే మద్యం సేవించిన రౌడీషీటర్ అజయ్ రాజు
యాడికిలో రౌడీషీటర్ అజయ్ వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంపై MLA గుమ్మనూరు జయరాం సీరియస్
రౌడీషీటర్ అజయ్‌కు టీడీపీతో సంబంధం లేదని స్పష్టం చేసిన MLA జయరాం
రౌడీషీటర్ అజయ్ గ్యాంగ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి: MLA జయరాం