Share News

ఒక్కసారిగా సీన్ రివర్స్! భారీగా తగ్గిన బంగారం ధర

ABN , Publish Date - Jan 30 , 2026 | 09:56 AM

గొత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు సడెన్‌గా యూటర్న్ తీసుకున్నాయి. దేశంలో బంగారం ధర సగటున రూ.8 వేల మేర, వెండి ధర రూ.15 వేల మేర తగ్గింది.

ఒక్కసారిగా సీన్ రివర్స్! భారీగా తగ్గిన బంగారం ధర
Gold, Silver Rates on Jan 30

ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా అంచనాలకు మించి పెరిగిన బంగారం ధరలు నేడు (జనవరి 30) ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపట్లోనే భారీ స్థాయిలో తగ్గాయి. దేశంలో మేలిమి బంగారం ధర సగటున రూ.8 వేల మేర, వెండి ధర రూ.15 వేల మేర తగ్గింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ధర ఒక్కసారిగా తగ్గిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి (Gold, Silver Rates on Jan 30).

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.8,230 మేర తగ్గి రూ.1,70,620కు చేరింది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.7550 మేర తగ్గి రూ.1,56,400కు చేరింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.4,15,000గా ఉంది. నిన్నటి రేటుతో పోలిస్తే ఇది రూ.10 వేలు తక్కువ.


ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో సామాన్యులు బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపిన విషయం తెలిసిందే. అనేక మంది జువెలరీ షాపులకు క్యూకట్టారు. కొందరు అప్పులు చేసి మరీ బంగారం కొనుగోళ్లకు దిగారు. ఈ నేపథ్యంలో బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు దారి తీయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం ధరలు 70 శాతం మేర పెరిగాయి. స్థూలంగా చూస్తే ఈ ఏడాది బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ఇవీ చదవండి:

బడ్జెట్ 2026.. కొత్త పన్ను విధానంలో మరిన్ని మార్పులు రానున్నాయా?

మూడో అతిపెద్ద విమాన మార్కెట్‌గా భారత్‌

Updated Date - Jan 30 , 2026 | 11:03 AM