Share News

అంతకంతకూ పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! రోజుకో కొత్త రికార్డు..

ABN , Publish Date - Jan 30 , 2026 | 06:30 AM

దేశంలో బంగారం, వెండి ధరలు రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. దేశంలో బంగారం ధర రూ.2 లక్షలకు చేరువవుతుండగా వెండి ధర రూ.4.2 లక్షలను దాటేసింది. మరి హైదరాబాద్‌లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

అంతకంతకూ పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! రోజుకో కొత్త రికార్డు..
Gold, Silver Rates Jan 30

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరల పరుగు కొనసాగుతూనే ఉంది. ఇటీవలి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశాల్లో ప్రమాణిక వడ్డీ రేటు యథాతథంగా కొనసాగినా డిమాండ్ మాత్రం తగ్గట్లేదు. అంతర్జాతీయ మార్కెట్స్‌ను అనుసరిస్తూ దేశీయంగా గురువారం బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర సుమారు 12 వేల మేర పెరగ్గా, కిలో వెండి రూ.30 వేల మేర పెరిగింది (Gold, Silver Rates Jan 30).

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం 6.00 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,886గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,63,960కు ఎగబాకింది. విజయవాడ, విశాఖపట్నంలో దాదాపు ఇదే రేటు కొనసాగుతోంది. ఇక చెన్నైలో అత్యధికంగా 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,83,290 వద్ద, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,68,010 వద్ద ట్రేడవుతోంది.


హైదరాబాద్‌లో వెండి ధర కూడా ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.4,25,100 వద్ద కొనసాగుతోంది. దేశరాజధాని ఢిల్లీలో కూడా ఇదే రేటు కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో మాత్రం కిలో వెండి రేటు రూ.4.10 లక్షల వద్ద ఉంది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవీ చదవండి:

మూడో అతిపెద్ద విమాన మార్కెట్‌గా భారత్‌

‘ద్రవ్యోల్బణ’ అంచనాకు కొత్త లెక్కలు

Updated Date - Jan 30 , 2026 | 06:44 AM