Share News

యూఏసీతో ఫ్లెమింగో ఏరోస్పేస్‌ ఒప్పందం

ABN , Publish Date - Jan 30 , 2026 | 06:12 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఫ్లెమింగో ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. రష్యాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ (యూఏసీ) ఒప్పందం...

యూఏసీతో ఫ్లెమింగో ఏరోస్పేస్‌ ఒప్పందం

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఫ్లెమింగో ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. రష్యాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ (యూఏసీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా యూఏసీ నుంచి ఆరు 68 సీట్ల ఐఎల్‌-114-300 ప్రాంతీయ విమానాలను కొనుగోలు చేయనుంది. తొలుత విమానాలను కొనుగోలు చేసినప్పటికీ తదనంతరం భారత్‌లోనే ఈ విమానాల తయారీకి ఈ భాగస్వామ్యం దోహదపడనుందని ఫ్లెమింగో ఏరోస్పేస్‌ సీఈఓ సుభాకర్‌ పప్పుల తెలిపారు. ఇందుకు సంబంధించి టెక్నాలజీ బదిలీని యూఏసీ చేపడుతుందని ఆయన చెప్పారు. 2027 చివరి నాటికి యూఏసీ నుంచి తొలి విమానం అందుకుంటామని, మిగిలిన విమానాలను విమానయాన కంపెనీలకు అనుగుణంగా భారత్‌లోనే సిద్ధం చేసి ఇవ్వనున్నట్లు సుభాకర్‌ తెలిపారు. ఆ తర్వాత భారత్‌లోనే విమానాల తయారీకి ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌ (ఎఫ్‌ఏఎల్‌)ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కెమెరా.. రెడ్ టేప్ ఎందుకు వేశారు..

యుద్ధ భయంతో తాత చేసిన పని.. 80 ఏళ్ల తర్వాత మనవడికి కలిసొచ్చింది..

Updated Date - Jan 29 , 2026 | 07:15 PM

Updated Date - Jan 30 , 2026 | 06:12 AM