‘ద్రవ్యోల్బణ’ అంచనాకు కొత్త లెక్కలు
ABN , Publish Date - Jan 30 , 2026 | 06:20 AM
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాల ప్రమాణాలు మారిపోతున్నాయి. ఈ నెల నుంచే ఇది అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు...
ఈ నెల నుంచే అమలు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాల ప్రమాణాలు మారిపోతున్నాయి. ఈ నెల నుంచే ఇది అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు సీపీఐ కోసం 2012 నాటి ధరల ఆధారంగా 299 వస్తువుల ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకునే వారు. ఇక నుంచి 2024 నాటి ధరల ఆధారంగా 358 వస్తువుల ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు. ఈ కొత్త ప్రామాణికాలతో లెక్కించే జనవరి నెల రిటైల్ ద్రవ్యోల్బణ వివరాలను కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ వచ్చే నెల 12న వెల్లడించనుంది. రిటైల్ ద్రవ్యోల్బణ అంచనా కోసం కొత్తగా విమాన చార్జీలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో అమ్మే వస్తువుల ధరలు, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ చందాల వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో సీపీఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్వణ వివరాలు మరింత వాస్తవికంగా ఉంటాయని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కెమెరా.. రెడ్ టేప్ ఎందుకు వేశారు..
యుద్ధ భయంతో తాత చేసిన పని.. 80 ఏళ్ల తర్వాత మనవడికి కలిసొచ్చింది..