మహాత్మునికి సీఎం చంద్రబాబు ఘన నివాళి
ABN , Publish Date - Jan 30 , 2026 | 10:14 AM
భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అహింస, సత్యం అనే ఆయుధాలతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. 1948 జనవరి 30న ఆయన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ.. ఆయన చూపిన బాట నేటికీ ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది.
అమరావతి, జనవరి 30: ఈ రోజు జనవరి 30 భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహాత్ముని త్యాగాలను, ఆశయాలను స్మరించుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా.. బాపు దేశానికి చేసిన సేవల్ని స్మరించుకున్నారు.
చంద్రబాబు నాయుడు నివాళి
'జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నాను. అహింసా విధానంతో కోట్ల మంది దేశ ప్రజలను ఒక్కతాటిపై నడిపి స్వాతంత్య్రం సాధించారు. గాంధీజీ బోధనలైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్దాంతాలను ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలి. స్వదేశీ, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, పేదరిక నిర్మూలన వంటి గాంధీజీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేద్దాం' అని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా సందేశంలో పేర్కొన్నారు.
జాతిపితకు మంత్రి నారా లోకేశ్ నివాళి
'సత్యం, అహింస మార్గాలనే ఆయుధంగా చేసుకుని మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ. జాతి సమగ్రత, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నాను.' అని నారా లోకేశ్ తన ఎక్స్ సందేశంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కాక్ పిట్‌లో చివరి మాటలివే..
భారీ నష్టాల నుంచి లాభాల వైపు.. చివర్లో కోలుకున్న దేశీయ సూచీలు