Share News

పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. దారుణంగా పతనమైన ధరలు..

ABN , Publish Date - Jan 30 , 2026 | 09:05 PM

నిన్న స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్‌లో 1,80,779 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కిలో వెండి ధర 4,20,048 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు ఊహించని విధంగా ధరలు భారీ స్థాయిలో పతనమయ్యాయి.

పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. దారుణంగా పతనమైన ధరలు..
gold silver prices fall

ఇంటర్‌నెట్ డెస్క్: గత కొన్ని రోజుల నుంచి చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. నిన్న (గురువారం) ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు నేడు అథ:పాతాళానికి పడిపోయాయి. నిన్న స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్‌లో 1,80,779 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కిలో వెండి ధర రూ.4,20,048 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు ఊహించని విధంగా ధరలు భారీ స్థాయిలో పతనమయ్యాయి.


24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.15,246 తగ్గింది. ప్రస్తుత ధర రూ. 1,54,157 ఉంది. వెండిపై ఏకంగా రూ. 67,891లు తగ్గింది. ప్రస్తుత ధర 3,32,002 రూపాయలుగా ఉంది. బంగారం, వెండి ధరలు ఒకే రోజు ఇంతలా పతనమవడానికి కారణం ఇన్వెస్టర్లు భారీ ప్రాఫిట్ బుకింగ్‌కు దిగటమేనని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు. ఫ్యూచర్స్‌తో పోలిస్తే ఈటీఎఫ్ ధరలు మరింత పతనమయ్యాయని తెలిపారు. ఫెడ్ తదుపరి చీఫ్‌గా ఆ విభాగం మాజీ అధికారి కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేస్తారన్న వార్తలు కూడా బంగారం, వెండి ధరలు తగ్గటానికి మరో కారణమని అనలిస్టులు అంటున్నారు.


ఇవి కూడా చదవండి..

వాళ్లది అర్థం లేని ప్రవర్తన.. పాక్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఫైర్

మాజీ మంత్రి విడదల రజనీకి నిరసన సెగ

Updated Date - Jan 30 , 2026 | 09:25 PM