మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి
ABN , Publish Date - Jan 30 , 2026 | 10:26 AM
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విప్లవాలు రక్తపాతంతో కూడిన యుద్ధాల ద్వారా జరిగితే, గాంధీజీ మాత్రం 'సత్యాగ్రహం' అనే కొత్త పంథాను ఎంచుకున్నారు. 'కంటికి కన్ను అనే సూత్రం ప్రపంచాన్ని గుడ్డిది చేస్తుంది' అని నమ్మిన మహాత్మా గాంధీ, ద్వేషాన్ని ప్రేమతో జయించవచ్చని నిరూపించారు.
హైదరాబాద్, జనవరి 30: నేడు (జనవరి 30) భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్ముని త్యాగాలను, ఆశయాలను స్మరించుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో బాపు దేశానికి చేసిన సేవల్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతించగా, హైదరాబాద్ లంగర్ హౌస్ లోని బాపూ ఘాట్ వద్ద గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మహాత్మునికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి
'అహింసనే ఆయుధంగా స్వాతంత్ర్య సంగ్రామాన్ని జయించి.. ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసిన వ్యక్తి మహాత్ముడు. జాతిపిత గాంధీజీ వర్ధంతి సందర్భంగా.. ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను' అని సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా 'ఎక్స్' ఖాతాలో వెల్లడించారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులు
హైదరాబాద్ లంగర్ హౌస్ లోని బాపూ ఘాట్ వద్ద గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి..
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కాక్ పిట్‌లో చివరి మాటలివే..
భారీ నష్టాల నుంచి లాభాల వైపు.. చివర్లో కోలుకున్న దేశీయ సూచీలు