పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
ABN , Publish Date - Jan 30 , 2026 | 09:04 AM
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఒంగోలు, జనవరి 30: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో గూడ్స్ రైలులోని వ్యాగన్లు.. పక్కనే ఉన్న రెండు రైల్వే ట్రాక్‌లపై పడిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు, సాంకేతిక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.
గూడ్స్ బోగీలు పట్టాలు తప్పడంతో.. విజయవాడ- చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదం కారణంగా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
For More AP News And Telugu News