క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సాయం.. అండగా కువైట్ టీడీపీ
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:35 PM
కువైట్‌లో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు ఎన్నో సంవత్సరాలుగా చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నారై తెలుగుదేశం పార్టీ కువైట్ విభాగానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.
ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): కువైట్‌లో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కార్యకలాపాలు ఎన్నో సంవత్సరాలుగా చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నారై తెలుగుదేశం పార్టీ కువైట్ విభాగానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు వర్ధంతి, మంత్రి నారా లోకేశ్ జన్మదినం, పార్టీ ఆవిర్భావ దినోత్సవం, మహానాడు వంటి అన్ని వేడుకలను విస్తృతంగా నిర్వహిస్తూ కువైట్‌ను పార్టీకి ఒక బలమైన కంచుకోటగా నిలబెట్టారు.
సేవా కార్యక్రమంలో ముందడుగు..
తెలంగాణకు చెందిన టీడీపీ కార్యకర్త వి. శ్రీశైలం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ఎన్నారై టీడీపీ కువైట్ నాయకుల దృష్టికి వచ్చింది. సోషల్ మీడియాలో పార్టీకి చురుగ్గా సేవలు అందిస్తున్న శ్రీశైలం
క్యాన్సర్ బారిన పడటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎన్నారై టీడీపీ గల్ఫ్ ఎంపవర్‌మెంట్ కోఆర్డినేటర్ కుదరవల్లి సుధాకరరావు, ఎన్నారై టీడీపీ గల్ఫ్ ఎంపవర్‌మెంట్ అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు, వారి కార్యవర్గం స్పందించారు.
చంద్రబాబు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్భాట వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన వారు, ఆ ఖర్చులను సేవా కార్యక్రమానికి మళ్లించారు. ఈ సందర్భంగా శ్రీశైలం వైద్య చికిత్స కోసం రూ.1,21,900లు ఆర్థిక సహాయం అందించారు. కువైట్‌లోని టీడీపీ కార్యకర్తలు కేవలం రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండటం ఈ ఘటన ద్వారా స్పష్టమైంది. ఒక కార్యకర్త కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే స్పందించి సహాయం అందించడం ద్వారా పార్టీకి ఉన్న బలమైన బంధం, సహకార భావన మరోసారి వెలుగులోకి వచ్చింది. శ్రీశైలం త్వరగా కోలుకుని తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
శ్రీశైలం త్వరగా కోలుకోవాలి: కుదరవల్లి సుధాకరరావు
ఒక కార్యకర్త ఆరోగ్యం కోసం సహాయం చేయడం నిజంగా సంతోషకరమని ఎన్నారై టీడీపీ గల్ఫ్ ఎంపవర్‌మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకరరావు పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేవుడి దయతో శ్రీశైలం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
శ్రీశైలం కోలుకుని మళ్లీ పార్టీకి సేవలందించాలి: మద్దిన ఈశ్వర్ నాయుడు
శ్రీశైలం వంటి సోషల్ మీడియా కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని ఎన్నారై టీడీపీ గల్ఫ్ ఎంపవర్‌మెంట్ అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ పార్టీకి సేవలందించాలని కోరుకున్నారు. ఈ సేవా కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు భాగస్వాములయ్యారు. వారిలో కుదరవల్లి సుధాకరరావు, మద్దిన ఈశ్వర్ నాయుడు, రషీద్ భేగం, బిల్లా రమేశ్ యాదవ్, కుసుమే కుటుంబరావు, ఈడుపుగంటి దుర్గాప్రసాద్, షేక్ బాషా, సుబ్బారావు, వీసీ సుబ్బారెడ్డి, కొల్లి ఆంజనేయులు, గాజులపల్లి సుబ్బారెడ్డి, మహ్మద్, లాస్య మొబైల్స్ అధినేత వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Also Read:
జాతీయ అవార్డు గ్రహీత మహేష్ కాలేకు 'లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు 2026
రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి: ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం
For More Latest News