Share News

రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి: ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం

ABN , Publish Date - Apr 25 , 2026 | 10:37 PM

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మెట్రో వర్జీనియాలో నార్త్ అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంను ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి: ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం
Komati Jayaram

రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఏపీ ప్రభుత్వ నార్త్ అమెరికా ప్రతేక ప్రతినిధి కోమటి జయరాం పిలుపునిచ్చారు. విద్యా, వైద్య సేవలను పేద ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి తోడ్పడాలని కోరారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మెట్రో వర్జీనియాలో నార్త్ అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంను ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు.

ఈ అభినందన సభకు భాను మాగులూరి అధ్యక్షత వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత NRIలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకురాబోతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువచ్చి పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు.

1.jpg


తానా అధ్యక్షులు నరేన్ కొడాలి మాట్లాడుతూ అమెరికాలో తెలుగుజాతి ఐక్యత కోసం, అభ్యున్నతి కోసం జయరాం చేసిన కృషి మరువలేనిదని, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పాఠశాలలో సాంకేతిక విద్యను అందించడానికి డిజిటల్ లేబొరేటరీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ తానా అధ్యక్షులుగా, ఎన్నారై టీడీపీ కో-ఆర్డినేటర్‌గా, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన అందించిన సేవలు మరుపురానివని కొనియాడారు. అమెరికాలో ఉన్న తెలుగు వారికి అండగా నిలబడి వారి సమస్యల పరిష్కారంలో భాగస్వామిగా నిలిచారు.

4.jpg

ఈ కార్యక్రమంలో యూఎస్ఏ బీజేపీ అధ్యక్షులు అడపా ప్రసాద్ మాట్లాడుతూ అమెరికాలో భారతీయులు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. వారి ప్రయోజనాలు కాపాడటానికి జయరాం ముందువరసలో నిలవాలన్నారు. జనసేన పార్టీ ప్రతినిధులు విజయ్ గుడిసేవ, వేణు పులిగుజ్జు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ మైత్రి, రాష్ట్ర ప్రగతి ఇక ముందూ కొనసాగాలన్నారు. టీడీపీ ప్రతినిధులు సుధీర్ కొమ్మి, యాష్ బొద్దులూరి, సాయి బొల్లినేని, ప్రవాస సంఘాల పెద్దలకు అభినందనలు తెలిపారు. ప్రవాస సంస్థ ఆటా ప్రతినిధులు కవిత చల్లా జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు రవి అడుసుమిల్లి, సాయిసుధా పాలడుగు, సతీష్ చింత, సత్యనారాయణ మన్నె, త్రిలోక్ కంతేటి, కృష్ణప్రియ అడుసుమిల్లి, కంచర్ల కిషోర్, పద్మజ బేవర, నాగ్ నెల్లూరి పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

6.jpg3.jpg5.jpg

Updated Date - Apr 26 , 2026 | 04:12 PM