జాతీయ అవార్డు గ్రహీత మహేష్ కాలేకు 'లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు 2026'
ABN , Publish Date - Apr 26 , 2026 | 01:35 PM
జాతీయ అవార్డు గ్రహీత, హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు మహేష్ కాలేకు ప్రతిష్ఠాత్మక 'లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు 2026' ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం తనకు చాలా ఆనందంగా, గర్వంగా ఉందన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జాతీయ అవార్డు గ్రహీత, హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు మహేష్ కాలేకు ప్రతిష్ఠాత్మక 'లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు 2026' ప్రదానం చేశారు. పూణెలో జరిగిన కార్యక్రమంలో 'సంగీత సేవ' విభాగంలో ఆయన ఈ గౌరవం అందుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ కాలే మాట్లాడుతూ.. మాస్టర్ దీననాథ్ మంగేష్కర్, లతా మంగేష్కర్, వారి కుటుంబ వారసత్వంతో సంబంధం ఉన్న ఈ అవార్డు తన జీవితంలో ఒక ప్రత్యేక ఘట్టమని ఆయన తెలిపారు.

ఈ అవార్డు రావడం తనకు చాలా ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. ముఖ్యంగా 'సంగీత సేవ' కోసం ఈ గౌరవం రావడం చాలా ప్రత్యేకమని చెప్పారు. మంగేష్కర్ కుటుంబ సభ్యులందరూ తనకు ఎప్పుడూ సహకరించారని తెలిపారు. తన గురూజీ కుమారుడు శౌనక్ అభిషేకి 90లలో ఉషా మంగేష్కర్‌తో పాటలు పాడేవారని, వారి రిహార్సల్స్, కచేరీలు చూసి తనకు ఎంతో ప్రేరణ వచ్చిందని చెప్పారు. హృదయనాథ్ మంగేష్కర్ ఎప్పుడూ తనను ప్రోత్సహించారని, మీనా, ఉషా, లతా, ఆశా అందరూ తన ప్రయాణంలో తోడుగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రత్యేక రోజున ఆశా, లతా మంగేష్కర్ చాలా గుర్తుకొస్తున్నారని చెప్పారు. 'కత్యార్ కల్జత్ ఘుసాలి’లో తన పాట విని హృదయనాథ్ 'నీ పాటలో నీ గురువు శ్రమ కనిపిస్తోంది' అని ప్రశంసించడం.. నాకు ఎంతో ప్రేరణ ఇచ్చిందన్నారు. ఈ అవార్డును తన గురూజీ పండిట్ జితేంద్ర అభిషేకి కృషికి అంకితం చేస్తున్నానని చెప్పారు.
Also Read:
జనసేన కార్యకర్త కుటుంబానికి అండగా పార్టీ గల్ఫ్ విభాగం
టీఎల్ సీఏ ఉగాది వేడుకల్లో ‘అమేయా’ ప్రారంభం
For More Latest News