Share News

నాట్స్ ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం.. సామాజిక సేవలో తెలుగు విద్యార్థులు

ABN , Publish Date - Apr 24 , 2026 | 01:19 PM

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హైవే దత్తత’ కార్యక్రమం సామాజిక సేవలో తెలుగు విద్యార్థుల చైతన్యాన్ని మరోసారి ప్రతిబింబించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు రహదారి పరిసరాలను శుభ్రపరిచి, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

నాట్స్ ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం.. సామాజిక సేవలో తెలుగు విద్యార్థులు
NATS Highway Adoption Program

ఇంటర్నెట్ డెస్క్: సామాజిక బాధ్యతను తెలుగు విద్యార్థుల్లో పెంచేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా స్థానిక ఈస్ట్ విండ్సర్ నగరంలో చేపట్టిన హైవే దత్తత సామాజిక స్పృహను చాటిచెప్పింది. పర్యావరణ పరిరక్షణను ఒక యజ్ఞంలా భావించి గతంలో పలు నగరాల్లో విజయవంతంగా సేవలు అందించిన నాట్స్, అదే స్ఫూర్తితో ఈసారి న్యూజెర్సీలో ఈస్ట్ విండ్సర్ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను భుజాన వేసుకుంది.

NATS (2).jpg


ఈ పారిశుధ్య కార్యక్రమంలో చిన్నారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. సమాజం పట్ల బాధ్యతను చిన్నతనం నుంచే అలవరుచుకోవాలనే సంకల్పంతో, రహదారి పరిసరాల్లోని వ్యర్థాలను తొలగించి తమ వంతు తోడ్పాటును అందించారు. సమాజ హితం కోసం పిల్లలు చూపిన ఈ చొరవ పెద్దలను సైతం ఆలోచింపజేసింది.

NATS (3).jpg


విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం వల్ల వారిలో క్రమశిక్షణ, సామాజిక స్పృహ పెరుగుతాయని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి అన్నారు.. పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని, ఇలాంటి పనులు విద్యార్థుల భవిష్యత్తుకు, వారి విద్యా సంబంధిత సేవా గుర్తింపునకు ఎంతో తోడ్పడతాయని ఆయన వివరించారు.

NATS.jpg

ఈ కార్యక్రమంలో నాట్స్ కార్యవర్గ సభ్యులు, ఇతర ప్రతినిధులు పాల్గొని పనులను పర్యవేక్షించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో సామాజిక హితమే లక్ష్యంగా నాట్స్ నిరంతరం కృషి చేస్తోందని నాట్స్ నాయకులు తెలిపారు. నాట్స్ ఎడాప్ట్ ఎ హైవేలో పాల్గొన్న వారందరిని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల అభినందించారు.


Also Read:

మంజుల ఘట్టమనేనిచే నాట్స్ వెల్‌నెస్ వెబినార్‌

హాంకాంగ్‌లో వైభవంగా ఉగాది వేడుకలు

For More Latest News

Updated Date - Apr 24 , 2026 | 03:05 PM