గల్ఫ్ దేశాలలో వైభవంగా చంద్రబాబు జన్మదినోత్సవం
ABN , Publish Date - Apr 21 , 2026 | 08:10 PM
ఎడారి దేశాలలో తెలుగు తమ్ముళ్లు మరోసారి కదం తొక్కారు. ఉత్సాహంతో ఉరకలేస్తూ తమ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎడారి దేశాలలో తెలుగు తమ్ముళ్లు మరోసారి కదం తొక్కారు. ఉత్సాహంతో ఉరకలేస్తూ తమ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
ఎన్నారై తెలుగుదేశం పార్టీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణా ఆధ్వర్యంలో సోమవారం రాత్రి గల్ఫ్ దేశాలలో జరిగిన వేడుకలలో పార్టీ అభిమానులు కేకులు కట్ చేసుకున్న అనంతరం చంద్రబాబు నాయుడు దార్శనికతను కొనియాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ సందర్భంగా గల్ఫ్ దేశాలలో తెలుగుదేశం పార్టీ అభిమానులు నిర్వహించిన రక్తదాన, ఇతర సేవా కార్యక్రమాలను విశదీకరించారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏపీ ఎన్నార్టీఎస్ చైర్మన్ రవి వేమూరు, శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు, గౌతు శిరీష, బ్రాహ్మణ సంక్షేమ మండలి చైర్మన్ కె. బుచ్చిరాం ప్రసాద్ ప్రత్యేక అతిథులుగా వీడియో కాల్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ మహిళా కార్యకర్తలతో గౌతు శిరీష మాట్లాడుతూ విదేశాలలో పార్టీ బలోపేతంలో మహిళలది కూడా కీలక పాత్ర అని అన్నారు.
గల్ఫ్‌లోని యువత, పార్టీ మహిళా అభిమానులతో పాటు వివిధ తెలుగు ప్రవాసీ సంఘాలు, సామాజిక సంస్థల సౌజన్యంతో తెలుగుదేశం శ్రేణులు జన్మదినోత్సవ కార్యక్రమాలను నిర్వహించారని రావి రాధాకృష్ణ పేర్కొన్నారు.
ప్రవాసాంధ్రుల ప్రభుత్వ సేవా సంస్థ అయిన ఏపీ ఎన్నార్టీఎస్ డైరెక్టర్ నాగేంద్ర బాబు అక్కిలి తమ సంస్థ ప్రవాసీయులకు అందిస్తున్న సేవలను వివరిస్తూ దేశంలోకెల్లా ఈ రకమైన మెరుగైన వ్యవస్థను నెలకొల్పింది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. గల్ఫ్ దేశాలలో కష్టకాలంలో తోటి తెలుగువారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు.
సౌదీ అరేబియాలో..
ఎప్పటి తరహాలోనే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యక్రమాన్ని ఒక పండుగ తరహాలో నిర్వహించే సౌదీ అరేబియాలోని రియాధ్ నగర తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉత్సాహంగా జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. రియాధ్‌తో పాటు దమ్మాం, ఖోబర్, జుబేల్ నగరాలలో కూడా కార్యక్రమాలు జరిగాయి. రియాధ్‌లో పార్టీ నాయకులు ఖాలిద్ సైఫుల్లా, జాని బాషా షేక్, రాజశేఖర్ చెన్నుపాటి, సారథి నాయుడు వడ్లమూడి, శిల్ప గడ్డం, అక్షిత మందవ, నరేష్ చెన్నుపాటి, సుచరిత కందుల, ముజమ్మిల్ షేక్, సతీష్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు జానీ బాషా, రాజశేఖర్, శిల్ప ఆధ్వర్యంలో పార్టీ అభిమానులకు విందు భోజనం ఏర్పాటు చేసారు. అదే విధంగా జుబేల్‌లో కోగంటి శ్రీనివాస్ రావు, మహేశ్వర రావు, దశరథం, ప్రసాద్, రావి సురేష్, షాజిద్ ఖాన్, బాలాజీ, నాగ గోవింద్ తదితరులు ఉత్సవాలు నిర్వహించారు.


ఖతర్‌లో..
ఖతర్ దేశంలో ప్రవాసాంధ్ర సామాజిక సేవలో తెలుగుదేశం ముందు భాగంలో ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీ ప్రముఖులు నరేష్ మద్దిపాటి, రవి పొనుగుమాటి, బొడ్డు రామారావు, జెవీవీ సత్యనారాయణ, సుధాకర్ కొడాలి, విక్రమ్ సుఖవాసి, గోవర్ధనరెడ్డి, నరేష్ నూతలపాటి, మల్లిరెడ్డి సత్యనారాయణ, స్వప్న పొనుగుమాటి, వాణి సుఖవాసి, కిరణ్ కుమారి ఈగలపాటి, కడియాల ప్రశాంతి, అనూష, లక్ష్మీ గొట్టిపాటి, రజని బొందలపాటి, వంశీ ప్రియా, వాసంతి బేతిని, జ్యోతి బొర్రా, కనక మహాలక్ష్మి, శిరీష మలసాని తదితరులు పాల్గొన్నారు.


కువైత్‌లో..
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో ముందుండే కువైత్‌లోని తెలుగు దేశం పార్టీ అభిమానులు చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుదరవల్లి సుధాకర రావు, మద్దిన ఈశ్వర్ నాయుడు, వి.సి.సుబ్బారెడ్డి, రషీదా బేగం, వేణు గోపాల్ స్వామి, రాహుల్, గాదిరాజు శివ, సాయి, కొల్లి ఆంజనేయులు, నాయనిపాటి విజయకుమార్ తదితరులు వేడుకలను నిర్వహించారు. పార్టీ ప్రముఖుడు వెంకట్ కోడూరి ఆధ్వర్యంలో కూడా వైభవంగా జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తాము నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించిందని అన్నారు. కార్యక్రమంలో దివాకర్ ఓలేటి, ఉదయ ప్రకాష్, రాచూరి రెడ్డి మోహన్, ముస్తాక్ ఖాన్, నారాయణమ్మ, రెడ్డయ్య చౌదరి, దుగ్గినేని మురళి, మాలిసేటి రవి, కరీముల్లా, శంకర్ యాదవ్, రామకృష్ణ, మురళి కేశినేని, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


ఒమాన్‌లో..
ఒమాన్ రాజధాని మస్కట్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు గరపాటి సత్య శ్రీధర్ మాట్లాడుతూ ఆధునిక నగరం అమరావతి రూపశిల్పి చంద్రబాబు అని ప్రశంసించారు. రాఘవేంద్ర, కాంతేటి వాసు బాబు, రాజేష్, నాగరాజు, అనిల్ నాగిడి, రామచంద్ర బొల్లినా, అనిల్ టెల్లా, మురళి కృష్ణ, హరి కృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

యూఏఈలో..
దుబాయిలో పార్టీ నాయకులు విశ్వేశ్వరరావు మోతుకూరి, తులసి కుమార్ ముక్కుగ, రాజా రవి, ప్రసాదు దరపనేని, రాయుడు శేష నూకరాజు, మహ్మద్ రబ్బానీ, మల్లిఖార్జున, తోట కిషోర్, మల్లికార్జున, బాబ్జాన్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

బహ్రెయిన్‌లో..
బహ్రెయిన్‌లో ప్రముఖ సామాజిక సేవకుడు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారైన డి.శివకుమార్ మృతితో బహ్రెయిన్‌లో విషాద ఛాయలు నెలకొని ఉండడంతో ఈ సారి కేవలం లాంఛనంగా జరిగాయి. బహ్రెయిన్ సభ్యులు రఘునాథ్ బాబు, హరి బాబు, సతీష్ శెట్టి, మోహన్, ఏవి రావు, బాలకృష్ణ, సతీష్ బొల్లా, శ్రీ రామ్ పండిత్ తదితరులు మాట్లాడారు.