మోదీ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది.. మల్లికార్జున ఖర్గే ధ్వజం
ABN , Publish Date - Oct 09 , 2026 | 07:42 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరుపై రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
ఢిల్లీ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈరోజు (శుక్రవారం) ఖర్గే ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సీఈసీ తీరుతో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని హెచ్చరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఇండియా కూటమి నేతలతో కలిసి కలుస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ చేస్తున్న తప్పులను రాష్ట్రపతికి వివరిస్తామని పేర్కొన్నారు.
ఓటు చోరీ, ఈవీఎంల ద్వారా తప్పు జరుగుతోంది..
సీఈసీకి వ్యతిరేకంగా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని రాష్ట్రపతికి తెలిపామని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఓటు చోరీ, ఈవీఎంల ద్వారా తప్పు జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఈ సమస్యలను అనేక సంవత్సరాలుగా కేంద్ర ఎన్నికల సంఘం ముందుంచామని వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఓటు హక్కు లభించిందని ప్రస్తావించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చిన్న చేప అని.. ఆయన వెనుక బీజేపీ సర్కార్ ఉందని ఆరోపించారు.
తప్పు జరిగిందని ఎన్నికల సంఘం అధికారులే చెబుతున్నారు..
నియంతృత్వ ధోరణితో మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని మల్లికార్జున ఖర్గే ఆగ్రహించారు. ఓటు హక్కు ద్వారానే నేతలు పదవుల్లో ఉన్నారని తెలిపారు. ఓటు హక్కును తొలగిస్తే నియంతృత్వం వస్తోందని చెప్పారు. తప్పు జరిగిందని ఎన్నికల సంఘం అధికారులే చెబుతున్నారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఈసీ, కేంద్ర విధానాలపై మా పోరాటం ఆగదు: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణను అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి: సీఎస్
మహిళా సాధికారతకు కొత్త అడుగు.. జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News