Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 19 , 2026 | 07:34 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 19, 2026 21:15 IST

    ఏపీ బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్ర రావు(54) కన్నుమూత

    • కిడ్నీ సంబంధిత వ్యాధితో గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి

    • శుక్రవారం విజయవాడ పడమట లంకలో అంత్యక్రియలు

    • కేసంనేని పూర్ణచంద్ర రావు మృతికి సంతాపం తెలిపిన పలు జర్నలిస్టు సంఘాలు, రాజకీయ ప్రముఖులు

  • Mar 19, 2026 20:46 IST

    కృష్ణా: మచిలీపట్నంలో మైనర్‌పై అత్యాచారం

    • బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిజాంపేటకు చెందిన పూజారి రఘు

    • ఆలస్యంగా వెలుగులోకి ఘటన

    • పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లిదండ్రులు

  • Mar 19, 2026 20:21 IST

    హైదరాబాద్‌లో ఆహార కల్తీ నియంత్రణపై పోలీస్‌శాఖ కీలక నిర్ణయం

    • పోలీసుల ఆధ్వర్యంలో ఆహార కల్తీ నియంత్రణపై కొత్త విభాగం

    • ‘H-FAST’ పేరుతో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసిన సీపీ సజ్జనార్

    • 28 మంది సభ్యులతో ‘H-FAST’ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన సీపీ

    • ఫుడ్ సేఫ్టీ అధికారులతో ‘H-FAST’ జాయింట్ ఆపరేషన్స్: సీపీ సజ్జనార్‌

    • సోషల్ మీడియాలో ఫిర్యాదులను కూడా స్వీకరించునున్న ‘H-FAST’

  • Mar 19, 2026 19:57 IST

    రంగారెడ్డి: స్కూటర్ ఆర్టీసీ బస్సు ఢీ.. వ్యక్తి మృతి

    • స్కూటర్‌ను ఢీకొన్న మెహిదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు

    • ఒక వ్యక్తి మృతి

    • మొయినాబాద్ తాజ్ హోటల్ సమీపంలో ఘటన

  • Mar 19, 2026 19:21 IST

    తెలంగాణ బడ్జెట్‌కు సర్వం సిద్ధం

    • శుక్రవారం 2026-27 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం

    • మధ్యాహ్నం 12:00 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి

    • మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు

    • రేపు ఉ.10:00 గంటలకు కేబినెట్‌ సమావేశం

  • Mar 19, 2026 19:11 IST

    హైదరాబాద్‌: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ శ్రేణుల సవాళ్లతో ఎల్బీ నగర్‌లో ఉద్రిక్తత

    • 'సే నో డ్రగ్స్' పేరుతో ఎల్బీ నగర్‌లో బీఆర్ఎస్ నేతల ఛాలెంజ్

    • ఛాలెంజ్ స్వీకరించి ఎల్బీ నగర్‌కు వచ్చిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు

    • ఎల్బీ నగర్‌ అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ శ్రేణుల నిరసన

    • ఎల్బీ నగర్‌ వెళ్తుండగా బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు

    • పోలీసులతో MLA సుధీర్‌రెడ్డి మధ్య వాగ్వాదం, తోపులాట

    • ఎల్బీ నగర్‌ సర్కిల్‌ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

  • Mar 19, 2026 19:06 IST

    తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ అవార్డుల వేడుక

    • హైదరాబాద్‌: హైటెక్స్‌లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం

    • హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి

    • అవార్డుల వేడుకకు తరలివచ్చిన సినీ ప్రముఖలు, రాజకీయ నేతలు

  • Mar 19, 2026 18:54 IST

    తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలిలో విప్‌ల నియామకం

    • విప్‌లను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

    • అసెంబ్లీలో విప్‌లుగా వేముల వీరేశం, విజయ రమణరావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి

    • మండలిలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను నియమించిన ప్రభుత్వం

    • ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు

    పూర్తి కథనం

  • Mar 19, 2026 18:45 IST

    మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సిట్‌ బృందం భేటీ

    • డ్రగ్స్‌ కేసులో ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్న సిట్‌

    • డ్రగ్స్‌ ఎక్కడి నుంచి తీసుకువచ్చారనేదానిపై సిట్‌ ఆరా

    • డ్రగ్స్‌ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారని సిట్‌ ఆరా

  • Mar 19, 2026 18:36 IST

    సిద్దిపేట: ఆయిల్‌ఫామ్‌ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత

    • ఆయిల్‌ఫామ్‌ ఫ్యాక్టరీలో స్టాల్స్‌ ఏర్పాటులో వివాదం

    • పరస్పరం కాంగ్రెస్‌, BRS శ్రేణుల నినాదాలు, చెదరగొట్టిన పోలీసులు

  • Mar 19, 2026 18:32 IST

    సిద్దిపేట: నర్మెట్లలో ఆయిల్‌ఫామ్‌ ఫ్యాక్టరీ వద్ద రైతు మేళా

    • రైతు మేళాను ప్రారంభించిన మండలి ఛైర్మన్‌ గుత్తా, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

    • పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, రైతులు

  • Mar 19, 2026 18:26 IST

    ప్రజలకు LPG కొరత లేకుండా చూస్తున్నాం: కేంద్రం

    • బ్లాక్‌ మార్కెటింగ్‌ అరికట్టడానికి అన్ని చర్యలు: కేంద్రం

    • నిన్న దేశవ్యాప్తంగా 6 వేల ప్రాంతాల్లో సోదాలు: కేంద్రం

    • ప్రజలు LPG బదులు PNG కనెక్షన్లను తీసుకోవాలని కోరుతున్నాం: కేంద్రం

    • దేశంలో ఆన్‌లైన్‌ బుకింగ్‌లు 94 శాతం పెరిగాయి: కేంద్రం

    • LPG సిలిండర్ల సరఫరా సాధారణ స్థాయిలో ఉంది: కేంద్రం

  • Mar 19, 2026 18:15 IST

    అమరావతి: దశల వారీగా ఉద్యోగ ఖాళీలు భర్తీ: హోం మంత్రి అనిత

    • విద్య, పోలీస్‌ శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామం: అనిత

    • యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని..

    • ఆచరణలో పెడుతున్న లోకేశ్‌కు కృతజ్ఞతలు: అనిత

  • Mar 19, 2026 18:02 IST

    తిరుపతి: గరుడ వారధి ప్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం

    • రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 10 మందికి గాయాలు

  • Mar 19, 2026 17:56 IST

    పల్నాడు: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్‌పై విడుదల

    • మాచర్లలో 144 సెక్షన్ విధింపు.. భారీగా పోలీసుల మోహరింపు

    • గురజాల సబ్ డివిజన్‌లో పోలీస్ 30 యాక్ట్ అమలు

    • నాపై అక్రమ కేసు బనాయించారు: పిన్నెల్లి

    • మాకూ తప్పకుండా ఒక రోజు వస్తుంది: పిన్నెల్లి

    • దీని వెనుక ఎవరున్నారో బయటకు లాగుతాం.. ఎవ్వరినీ వదిలం: పిన్నెల్లి

  • Mar 19, 2026 17:42 IST

    ఉగాది రోజు రాష్ట్ర యువతకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది: పవన్‌

    • 10,060 పోస్టుల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశాం: పవన్‌

    • నిర్దేశిత సమయంలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం: పవన్‌ కల్యాణ్‌

    • కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను అర్థం చేసుకుంటోంది: పవన్‌

    • ఈ 20 నెలల్లో 30,607 ఉద్యోగాలు ఇచ్చాం: పవన్‌ కల్యాణ్‌

  • Mar 19, 2026 17:35 IST

    నేటి మార్కెట్లో భారీగా తగ్గిన బంగారం ధరలు

    • నిన్నటి కంటే రూ.7140 తగ్గి రూ.1,50,280కు చేరిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం

    • రూ.6550 పతనమై రూ.1,37,750గా ట్రేడ్ అవుతున్న 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి

    • రూ. 2.65 లక్షలకు చేరిన కిలో వెండి

    పూర్తి కథనం

  • Mar 19, 2026 17:22 IST

    నా ఛాంప్‌తో కలిసి ఉగాది వేడుకలు.. మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్'లో పోస్ట్

    • నా ఛాంప్‌తో కలిసి ఉగాది వేడుకలు జరుపుకుంటున్నాను!: లోకేశ్

    • ఈ ఏడాదిని మరిన్ని ‘తీపి’ క్షణాలతో, తక్కువ ‘చేదు’ అనుభవాలతో నింపుకుందాం: లోకేశ్

    • పండుగ ప్రత్యేక వంటకాలు ఆస్వాదించేందుకు నా కఠినమైన డైట్‌కు బ్రేక్: లోకేశ్

    పూర్తి కథనం

  • Mar 19, 2026 16:53 IST

    పశ్చిమ గోదావరి: పాలకొల్లులో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ

    • 300కు పైగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు

  • Mar 19, 2026 16:45 IST

    ఉగాది వేళ యువతకు మంత్రి లోకేశ్ తీపికబురు అందించారు: మంత్రి అనగాని

    • జాబ్ క్యాలెండర్ ద్వారా విద్య, పోలీస్ శాఖకు అధిక ప్రాధాన్యం: మంత్రి

    • గతంలో.. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ జగన్ మోసం చేశారు: అనగాని సత్యప్రసాద్

    • ఇచ్చిన హామీ మేరకు 25 లక్షల ఉద్యోగాల సాధనకు కూటమి ప్రభుత్వం కృషి: మంత్రి

    పూర్తి కథనం

  • Mar 19, 2026 16:16 IST

    మహబూబాబాద్‌లోని కంబాలపల్లిలో దారుణం

    • భార్యపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేసిన భర్త

    • కుటుంబ కలహాలతో దాడి

    • దాడిలో భార్యకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

    పూర్తి కథనం

  • Mar 19, 2026 16:05 IST

    దేశీయ సూచీలకు భారీ నష్టాలు

    • 2496 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

    • 775 పాయింట్లు దిగజారిన నిఫ్టీ

    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 92.63

    పూర్తి కథనం

  • Mar 19, 2026 15:46 IST

    20 నెలల్లో 30వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

    • మరో పదివేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: ఎమ్మెల్యే

    • సీఎం చంద్రబాబు కష్టపడి పనిచేస్తున్నారు: శ్రీధర్ రెడ్డి

    • చంద్రబాబు రాజనీతిజ్ఞుడు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

  • Mar 19, 2026 15:25 IST

    నెల్లూరును గ్రీన్ సిటీగా మారుస్తాం: మంత్రి నారాయణ

    • ఇండోర్‌లో పర్యటించి అధ్యయనం చేశాం: నారాయణ

    • సిటీలో 1,300 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు‌ చేస్తాం: మంత్రి నారాయణ

  • Mar 19, 2026 15:20 IST

    కువైట్‌, సౌదీపై మరోసారి ఇరాన్‌ దాడులు

    • ఆయిల్‌ రిఫైనరీలపై దాడులు చేసిన ఇరాన్‌

    • ఇరాన్‌ దాడుల నేపథ్యంలో కూలిన స్టాక్‌మార్కెట్లు

    • 116 డాలర్లకు చేరిన క్రూడాయిల్‌ ధర

    • సౌదీలోని ఆరామ్‌కో రిఫైనరీపై ఇరాన్‌ దాడి

  • Mar 19, 2026 15:12 IST

    తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

    • పలు జిల్లాల్లో వర్షాలతో పాటు పిడుగుపాటు హెచ్చరికలు

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

    • తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన

    • 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

    పూర్తి కథనం

  • Mar 19, 2026 15:06 IST

    ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

    • ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ

    • లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు వ్యాఖ్యలను తొలగించాలని హైకోర్టును ఆశ్రయించిన ఈడీ

    • ఈ కేసు విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ధర్మాసనం

    పూర్తి కథనం

  • Mar 19, 2026 15:01 IST

    మచిలీపట్నంలో ఉగాది వేడుకలు.. పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర

    • ఉగాది ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలి: మంత్రి కొల్లు రవీంద్ర

    • కూటమి ప్రభుత్వానికి దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలి: మంత్రి

    • ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తవ్వాలి: రవీంద్ర

    పూర్తి కథనం

  • Mar 19, 2026 14:52 IST

    ఏపీలో అకాల వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష

    • దెబ్బతిన్న పంటలను గుర్తించి.. నష్టాన్ని నమోదు చేయండి: మంత్రి

    • రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది: అచ్చెన్నాయుడు

    పూర్తి కథనం

  • Mar 19, 2026 14:40 IST

    భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌మార్కెట్లు

    • 2100 సెన్సెక్స్, 650 పాయింట్లకుపైగా నష్టాల్లో నిఫ్టీ

    • ఒకే రోజు రూ.8 లక్షల కోట్లకుపైగా సంపద ఆవిరి

    • స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం

    • గ్యాస్‌, చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇరాన్ దాడులతో ప్రభావం

    • అంతర్జాతీయ మార్కెట్‌లో 111 డాలర్లకు చేరిన బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర

  • Mar 19, 2026 14:32 IST

    ఉగాది పచ్చడి సందేశం.. జీవితం షడ్రుచుల సమ్మేళనం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    • మోదీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో భారత్: కిషన్ రెడ్డి

    • శాంతి, సుభిక్షం దిశగా భారత్: కిషన్‌ రెడ్డి

    • ప్రపంచ సంక్షోభాల మధ్య భారత్ ఎదుగుతోంది: కిషన్‌రెడ్డి

    పూర్తి కథనం

  • Mar 19, 2026 14:16 IST

    లండన్‌లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులపై భారీ జరిమానా

    • లండన్ వీధుల్లో ఉమ్మేసినందుకు ఒక్కొక్కరిపై 1,391 పౌండ్స్ ఫైన్

    • వ్యవహారాన్ని ముందే సెటిల్ చేసుకోనందుకు పెరిగిన జరిమానా

    • భారత సంతతి వ్యక్తులిద్దరూ విచారణ కోసం కోర్టుకు హాజరుకాని వైనం

  • Mar 19, 2026 13:44 IST

    ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: కవిత

    • ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది.. రేపు జాగృతి రావొచ్చు: కవిత

    • ప్రతి ఉగాది నాడు ప్రజా బడ్జెట్‌ను తెలంగాణ జాగృతి ప్రవేశపెడుతుంది

    • రేపు రూ.3.23లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతారని తెలిసింది: కవిత

    • బడ్జెట్‌లో విద్య, వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయించాలి: కవిత

  • Mar 19, 2026 13:22 IST

    చైనాలో భారత రాయబారిగా విక్రమ్‌ కె.దొరైస్వామి నియామకం

    • దొరైస్వామిని నియమించినట్లు భారత విదేశాంగశాఖ ప్రకటన

    • ప్రస్తుతం యూకేలో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్న దొరైస్వామి

  • Mar 19, 2026 13:22 IST

    పల్నాడు: గురజాల సబ్‌ డివిజన్‌లో నెలరోజులపాటు 144 సెక్షన్‌ విధింపు

  • Mar 19, 2026 12:48 IST

    ఖతార్‌పై ఇరాన్ వరుస క్షిపణి దాడులు..

    • రాస్ లఫ్ఫాన్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణుల దాడి

    • ప్రపంచంలోనే అతిపెద్ద LNG కేంద్రమైన రాస్ లఫ్ఫాన్

    • ఇరాన్ దౌత్య అధికారులను దేశం నుండి బహిష్కరించిన ఖతార్

  • Mar 19, 2026 12:47 IST

    ఉద్యోగుల స్థానంలో ఏఐ.. కంపెనీల అభిప్రాయం ఇదే

    • 90 శాతం కంపెనీల అభిప్రాయం ఇదే

    • ఏఐపై పెట్టుబడులు భవిష్యత్తుకు కీలకమని కంపెనీల విశ్వాసం

    • రెజ్యూమెబిల్డర్ సంస్థ సర్వేలో వెల్లడి

  • Mar 19, 2026 12:37 IST

    కాకినాడ జిల్లా నుంచి పోలవరం జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి

    • రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాడు అటవీప్రాంతంలో పులి

    • వెళ్లిన మార్గంలోనే తిరిగి వెనక్కివచ్చిన పెద్దపులి

  • Mar 19, 2026 12:10 IST

    రవీంద్ర భారతి పంచాంగ పఠనంలో కీలక వ్యాఖ్యలు

    • వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధితో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది

    • సనాతన ధర్మాన్ని అవమానించే వారికి పరాభవం తప్పదు

    • ఏప్రిల్ 10 నుంచి జూలై 4 వరకు కాల సర్ప యోగం

    • ఎవ్వరికి ప్రశాంతత ఉండదు

    • కలెక్టర్లు, ఎస్పీలకు నిద్ర కూడా ఉండదు

    • పక్క రాష్ట్రాలతో నీటి పంపకాల్లో జాగ్రత్తగా ఉండాలి

  • Mar 19, 2026 12:10 IST

    రవీంద్ర భారతి పంచాంగ పఠనంలో కీలక వ్యాఖ్యలు

    • ఈ ఏడాది కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి

    • ఆర్థిక శాఖ మంత్రికి చిక్కులు తప్పవు

    • నిధులు నిధులు అంటే.. ఆగండి ఆగండి అనాల్సి వస్తుంది

    • ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

    • వైద్య ఆరోగ్యశాఖలో భారీ ప్రక్షాళన తప్పదు

  • Mar 19, 2026 12:08 IST

    ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ విడుదల చేస్తాం: సీఎం చంద్రబాబు

    • 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలండర్

    • మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం

    • ఇప్పటివరకు 30,607 ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇచ్చాం

  • Mar 19, 2026 12:07 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు

    • సాహిత్యం, సంగీతం, కళారంగాల్లో ఉగాది కళారత్న పురస్కారాలు అందించిన సీఎం

    • 38 మందికి కళారత్న, 122 మందికి ఉగాది పురస్కారాలు అందజేత

  • Mar 19, 2026 11:59 IST

    జగన్ జాతకం బలహీనంగా ఉందని చెప్పిన పంచాంగకర్త

    • ఈ ఏడాది జగన్‌కు అనుకూలంగా లేదన్న సిద్ధాంతి

    • రాబోయే కాలంలో జగన్ జాతకం కొంత మెరుగుపడొచ్చన్న సిద్ధాంతి

    • తాడేపల్లి పంచాంగశ్రవణంలో పాల్గొన్న జగన్, భారతి

  • Mar 19, 2026 11:54 IST

    హైదరాబాద్: రవీంద్రభారతిలో శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకలు

    • జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

    • పాల్గొన్న మంత్రులు భట్టి, పొంగులేటి, జూపల్లి, పొన్నం, కొండా సురేఖ

    • రవీంద్రభారతిలో డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ పంచాంగ ప్రవచనం

  • Mar 19, 2026 11:54 IST

    ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట

    • కవిత కొత్త పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

    • తెలంగాణ ప్రజా జాగృతిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి ఆదేశం

  • Mar 19, 2026 11:01 IST

    మేడ్చల్: నారపల్లిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

    • హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్న విద్యార్థిని నందిని

    • సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్‌ ఇయర్ చదువుతున్న నందిని

    • విద్యార్థిని స్వస్థలం సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల

  • Mar 19, 2026 10:59 IST

    భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయం తరఫున సీఎం రేవంత్‌కు ఆహ్వానం

    • బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ

    • నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు

    • ఈనెల 27న భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ మహోత్సవం

  • Mar 19, 2026 10:56 IST

    ఉగాది సందర్భంగా సీఎంఆర్ఎఫ్ ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం

    • 6,787 మందికి ఆర్థిక సాయం అందించేందుకు ఫైల్‌పై సీఎం సంతకం

    • రూ.55.63కోట్ల సీఎంఆర్ఎఫ్ ఫైల్‌పై సంతకం చేసి నిధులు విడుదల

  • Mar 19, 2026 10:33 IST

    గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్

    • హైదరాబాద్‌లో రూ.2,780ల మేర తగ్గిన 24 క్యారెట్ బంగారం ధర

    • ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ.1,54,640

    • 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.1,41,750

  • Mar 19, 2026 10:22 IST

    దేశీయ మార్కెట్లపై క్రూడాయిల్ ధరల ఎఫెక్ట్

    • గ్యాస్, చమురు కేంద్రాలను ఇరాన్ టార్గెట్ చేయడంతో తీవ్ర ప్రభావం

    • 111 డాలర్లకు చేరిన బ్రెంట్ కూడ్రాయిల్ ధర

    • జీవితకాల కనిష్ఠానికి పడిపోయిన రూపాయి మారకం

    • డాలర్‌తో పోలిస్తే 92.89కి చేరిన రూపాయి మారకం విలువ

  • Mar 19, 2026 10:17 IST

    భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు

    • సెన్సెక్స్ 1,550, నిఫ్టీ 450 పాయింట్లకుపైగా నష్టం

    • 3 శాతం నష్టపోయిన బ్యాంకింగ్ ఇండెక్స్

  • Mar 19, 2026 10:11 IST

    విజయవాడ: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు

    • ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రులు

  • Mar 19, 2026 09:16 IST

    ఢిల్లీ: దేశ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

    • నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్ష

    • వసంత రుతువు కొత్త శక్తికి, అవకాశాల స్ఫూర్తికి సంకేతం: ప్రధాని

    • తదుపరి వ్యవసాయ చక్రానికి సిద్ధమవుతున్న రైతన్నలకు శుభాభినందనలు: ప్రధాని

    • జీవితంలోని అన్ని రుచులను(తీపి, చేదు) సమానంగా స్వీకరించడమే ఉగాది సందేశం

  • Mar 19, 2026 09:06 IST

    కవిత కొత్త పార్టీ పేరు 'తెలంగాణ ప్రజా జాగృతి'గా ఖరారు

    • పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి కవిత దరఖాస్తు

    • జనవరి 23నే ఈసీకి దరఖాస్తు చేసిన కవిత

  • Mar 19, 2026 08:36 IST

    ఇండియా జస్టిస్ రిపోర్ట్‌-2025 విడుదల

    • వినియోగదారులకు న్యాయంలో చివరి స్థానంలో తెలంగాణ

    • వినియోగదారులకు న్యాయంలో అగ్ర స్థానంలో ఏపీ

  • Mar 19, 2026 08:35 IST

    నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

    • శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఉగాది ఆస్థానం

  • Mar 19, 2026 08:04 IST

    తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

    • మనిషిలోని చెడు లక్షణాలు పరాభవం చెంది మంచితనం విజయం సాధించాలి

    • రాష్ట్రం పునర్వైభవాన్ని సంతరించుకుని, ప్రగతి పథాన పయనించాలి

  • Mar 19, 2026 08:02 IST

    ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడంటే..

    • ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్

    • 91 గ్రూప్-1, హోంశాఖలో 2,778 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్

    • ఇతర శాఖల్లో 928 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్

    • విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రకటన

    • 750 గ్రూప్-2, 503 AEE, ఇతర శాఖల్లో 506 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్

    • పాఠశాల, ఇంటర్ విద్యకు చెందిన 3,004 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్

  • Mar 19, 2026 07:59 IST

    ఇరాన్‌కు సౌదీ అరేబియా హెచ్చరిక

    • ఏ క్షణమైనా మిలటరీ యాక్షన్‌కు దిగుతాం: సౌదీ అరేబియా

    • మరోవైపు గల్ఫ్ దేశాలకు ఇరాన్ కౌంటర్‌

    • చమురు, గ్యాస్ పరిశ్రమలను నాశనం చేస్తాం: ఇరాన్‌

  • Mar 19, 2026 07:38 IST

    ఏపీ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ: మంత్రి లోకేష్

    • ఉద్యోగార్థులంరికీ ఉగాది శుభాకాంక్షలు

    • ఇక మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి

    • ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది

    • నా మాట నేను నిలబెట్టుకున్నా

  • Mar 19, 2026 07:34 IST

    జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

    • 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల

    • వచ్చే 7 నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్న ఏపీ ప్రభుత్వం