రెయిన్ అలర్ట్.. మరో మూడుగంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:36 PM
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. భారీ వానల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు (Heavy Rains) పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. భారీ వానల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాగల మూడు గంటల్లో కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ఏపీలో రానున్న మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వానలు పడతాయని వెల్లడించారు. ఈరోజు రాత్రికి కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అన్నారు. రేపు(శుక్రవారం)ఏపీవ్యాప్తంగా విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఎల్లుండి(శనివారం) ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం ఉత్తరాంధ్రా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
పిడుగులు పడే సమయంలో పొరపాటున కూడా చెట్ల కింద ఉండకూడదని.. ఇది ప్రాణాపాయానికి దారితీస్తుందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పొలాలు, చెరువులు, ఖాళీ ప్రదేశాల్లో ఉన్నవారు వెంటనే సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో అన్నదాతలు మినుము, మిరప, పసుపు, ఇతర పంటలను తడవకుండా భద్రపరుచుకోవాలని సూచించారు. పొలాల్లో పని చేసే రైతులు, పశువుల కాపరులు పిడుగుల శబ్దం వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. వర్షం తగ్గే వరకు ఆరుబయట ఉండటం ప్రమాదకరమని ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐదు రకాల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించొచ్చు: సీఎం
విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్
జగన్ హయాంలో వివేకా హత్య కేసులో ఏ ఒక్క ఆధారమైనా ఎందుకు బయటపెట్టలేదు.. షర్మిల ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News