Share News

ఉగాది ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలి: మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Mar 19 , 2026 | 03:30 PM

సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.

ఉగాది ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలి: మంత్రి కొల్లు రవీంద్ర
Minister Kollu Ravindra

కృష్ణాజిల్లా, మార్చి 19: ఉగాది ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) ఆకాంక్షించారు. ఉగాది పండుగ సందర్భంగా మచిలీపట్నంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం, పండితులకు పురస్కారాలు, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. వేద పండితులను మంత్రి కొల్లు రవీంద్ర సత్కరించి నగదు బహుమానాలను అందజేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో తులతూగాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం తదితర ప్రాజెక్ట్‌లు సకాలంలో పూర్తి కావాలని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం నెరవేరాలని మంత్రి రవీంద్ర అభిలాషించారు.


ఇవి కూడా చదవండి..

ప్రపంచాన్ని శాసించే దిశగా భారత్: పీవీఎన్ మాధవ్

అకాల వర్షాలు.. రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 19 , 2026 | 04:19 PM