ప్రపంచాన్ని శాసించే దిశగా భారత్: పీవీఎన్ మాధవ్
ABN , Publish Date - Mar 19 , 2026 | 01:33 PM
పంచాంగం అంటే ఐదు అంగాలకు సంబంధించిన కాలాన్ని గణన చేసే ఒక అద్భుతమైన వ్యవస్థ అని పీవీఎన్ మాధవ్ అన్నారు. ప్రపంచంలో ఇలాంటిది ఎక్కడా లేదని పేర్కొన్నారు.
విజయవాడ, మార్చి 19: రాష్ట్ర ప్రజలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్(PVN Madhav) పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మనం తల్లిదండ్రులను 'మమ్మీ - డాడీ' అని పిలవడంలో ఆనందం పొందుతున్నాము. కానీ అమ్మ, నాన్న, అత్తయ్య, బాబాయ్, పెద్దనాన్న, పెద్దమ్మ వంటి పిలుపులు ఇప్పుడు అంతరించిపోతున్నాయి.. మనం వాటిని ఆస్వాదించలేకపోతున్నాం’ అంటూ విచారం వ్యక్తం చేశారు. ఆంగ్ల భాష నేర్చుకోవడం ద్వారానే గొప్పవాళ్లమనే భావన బలపడిందని ఆయన అన్నారు.
పంచాంగం అంటే ఐదు అంగాలకు సంబంధించిన కాలాన్ని గణన చేసే ఒక అద్భుతమైన వ్యవస్థ అని మాధవ్ అన్నారు. ప్రపంచంలో ఇలాంటిది ఎక్కడా లేదని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. భారతీయ సంస్కృతిని పునఃప్రతిష్ఠించే వేదిక అని ఆయన స్పష్టం చేశారు. ‘నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్’ అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ సారథ్యంలో త్వరలోనే ప్రపంచాన్ని శాసించే దిశగా భారతదేశాన్ని చూడబోతున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మన పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలపై అభిమానం పెంచుకోవాలి.. స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకోవాలి’ అని పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
పరాభవ నామ సంవత్సరం అందరికీ మంచి చేయాలి: సీఎం చంద్రబాబు
ప్రతి ఏడాది ఉగాది రోజున జాబ్ క్యాలెండర్: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News