Share News

సామాన్యులకి 'షడ్రుచుల' జీవితం.. రాజకీయ నేతలకు మాత్రం రాజపూజ్యం!

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:20 PM

ప్రతి ఏడాది ఉగాది పంచాంగ శ్రవణంలో నాయకులకు ఎప్పుడూ రాజపూజ్యం. పాపం సామాన్యుడికి మాత్రం 'అవమానం' వాటా ఎప్పుడూ తప్పదు! అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను ప్రకాశ్ కోగంటి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు.

సామాన్యులకి 'షడ్రుచుల' జీవితం.. రాజకీయ నేతలకు మాత్రం రాజపూజ్యం!
Ugadi Panchangam predictions

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 19: ఉగాది అంటే.. షడ్రుచుల సమ్మేళనం అంటారు. రుచుల మాదిరిగానే వ్యక్తుల జీవితంలోనూ మంచి చెడులు, కష్టాలు, సుఖాలు ఉంటాయి. తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజున కాల చక్రం మారడమే కాదు.. వ్యక్తుల గ్రహగతులు కూడా మారుతాయి. అందుకే ఆ రోజున చాలా మంది ప్రజలు తమ జన్మ నక్షత్రం ప్రకారం రాబోయే రోజులు ఎలా ఉంటాయనే అంశాన్ని పండితుల వద్దకు వెళ్లి తెలుసుకుంటారు.


ఉగాది పర్వదినాన ప్రభుత్వాలు, పొలిటికల్ పార్టీలు, ఆలయాలు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ పంచాంగ పఠనంలో పంచాంగకర్తలు సామాన్యులకు మంచి-చెడు, లాభాలు-నష్టాలు, తీపి-చేదు విషయాలు ఏయే నిష్పత్తిలో ఉన్నాయో చెప్తారు. కానీ, ఇక్కడ చాలామంది సందేహపడేది ఒకే ఒక విషయంలో. అదేంటంటే.. రాజకీయ నాయకుల విషయంలో మాత్రం పంచాంగం ప్రకారం అన్నీ మంచి రోజులే ఉంటాయంటారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను ప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

రజినీని బాధపెట్టాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు.. టీవీకే నేత క్షమాపణలు..

భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం!

Updated Date - Mar 19 , 2026 | 01:15 PM