Share News

భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం!

ABN , Publish Date - Mar 18 , 2026 | 10:17 AM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున బ్రిజేశ్వరి అనెక్స్ కాలనీలోని ఒక బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం!
Indore Fire Accident

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున బ్రిజేశ్వరి అనెక్స్ కాలనీలోని ఒక బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూటీమ్ చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల భవనంలోని ప్రజలు భయంతో రోడ్డుమీద‌కు వచ్చారు.


ఇండోర్ పోలీస్ కమిషనర్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి బయట ఛార్జింగ్ అవుతున్న ఎలక్ట్రిక్ వాహనం (EV) ఛార్జింగ్ పాయింట్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో నిల్వ ఉంచిన 10కి పైగా గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. పెద్ద పెద్ద శబ్ధాలు రావడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. ఈ ఘటనలో ఏడుగురు మరణించినట్లు నిర్ధారించారు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.


ఈ భవనం మనోజ్ పుగాలియా అనే వ్యాపారికి చెందినదని, ఆయన పాలిమార్ వ్యాపారం చేస్తుంటారని పోలీసులు తెలిపారు. ఇండోర్ జిల్లా కలెక్టర్ శివం వర్మ మాట్లాడుతూ..‘రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు’ అని అన్నారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగా ఈ ఘటన జరగడంతో బాధితులు తేరుకునే లోపే ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలను సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

మళ్లీ పెరిగిన బంగారం ధర..

Updated Date - Mar 18 , 2026 | 11:32 AM