పెనుకొండకు పెద్ద పరిశ్రమ
ABN , Publish Date - Mar 19 , 2026 | 11:50 AM
పెనుకొండకు మరో పెద్ద పరిశ్రమ రాబోతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.
త్వరలోనే ప్రకటన.. మంత్రి సవిత
గోరంట్ల(అనంతపురం): పెనుకొండకు మరో పెద్ద పరిశ్రమ రాబోతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత(Minister Savitha) పేర్కొన్నారు. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మండలంలో 44వ నంబరు జాతీయ రహదారి పక్కనే ఉన్న పాలసముద్రం చెరువు సుందరీకరణ పనులకు మంత్రి బుధవారం భూమిపూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాను పర్యాటక హబ్‌గా మార్చబోతున్నామన్నారు. పాలసముద్రం చెరువు కట్టను రూ.50లక్షల వాటర్ షెడ్ నిధులతో సుందరీకరిసున్నామన్నారు.
చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్, పార్కు, జిమ్, క్రీడామైదానం తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. జిల్లా ప్రజలకు అనూహ్య బహుమతిని కలెక్టర్ త్వరలో అందజేస్తారన్నారు. పెనుకొండ నియోజకవర్గానికి పెద్ద పరిశ్రమ రాబోతోందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్యాంప్రసాద్, డ్వామా పీడీ విజయప్రసాద్, తహసీల్దార్ మధుసూదన్‌నాయక్, ఎంపీడీఓ కమలాబాయి, ఇరిగేషన్ డీఈ రమణారెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News