ఉగాది రోజున గుడ్ న్యూస్.. పసిడి ధరలో భారీ కోత
ABN , Publish Date - Mar 19 , 2026 | 10:40 AM
ఉగాది రోజున దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. మేలిమి బంగారం ధర సగటున రూ.2,700 పతనం కాగా వెండి ధరలో రూ.5 వేల మేర కోత పడింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: పసిడి కొనాలనుకునే వారికి ఉగాది రోజున ఒక గుడ్ న్యూస్! నేడు (మార్చ్ 19) దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. మేలిమి బంగారం ధర సగటున రూ.2,700ల మేర పతనం కాగా, వెండి ధరలో రూ.5 వేల మేర కోత పడింది (Gold, Silver Rates on Mar 19).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మార్చ్ 19) ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ.1,54,640లకు దిగొచ్చింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే ఏకంగా రూ.2,780ల మేర పతనమైంది. 22 క్యారెట్ పసిడి ధర కూడా రూ.2,550ల మేర తగ్గి రూ.1,41,750ల వద్ద ట్రేడవుతోంది. నగరంలో వెండి ధర కూడా రూ.10 వేల మేర పతనమైంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,65,000ల వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,940గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో రూ.1,54,640ల వద్ద కొనసాగుతోంది. న్యూఢిల్లీలో రూ.1,54,790గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ పసిడి ధర రూ.1,45,690 కాగా, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో రూ.1,41,750గా ఉంది. న్యూఢిల్లీలో రూ.1,41,900గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే చెన్నైలో ప్రస్తుతం కిలో వెండి అత్యధికంగా రూ.2,65,000ల వద్ద కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు సహా పలు ఇతర నగరాల్లో రూ.2.6 లక్షలకు చేరుకుంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఈ వార్తలూ చదవండి:
దేశంలో తయారీ రంగానికి ప్రోత్సాహం.. రూ.33,660 కోట్లతో భవ్య
స్టాక్ మార్కెట్ సంపద.. 3 రోజుల్లో రూ.9.18 లక్షల కోట్ల మేర వృద్ధి