Share News

ఎవరితోనూ పొత్తు ఉండదు: విజయ్‌

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:23 AM

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమిలో చేరకుండా, ఎవరితోనూ పొత్తు లేకుండా అధికారంలోకి వస్తామని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌ ధీమా...

ఎవరితోనూ పొత్తు ఉండదు: విజయ్‌

చెన్నై, మార్చి 18(ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమిలో చేరకుండా, ఎవరితోనూ పొత్తు లేకుండా అధికారంలోకి వస్తామని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలో జరిగిన ఇఫ్తార్‌ విందుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి రకరకాల వదంతులు రేగుతున్నాయని పేర్కొన్నారు. ఏదో ఒక పార్టీకి బీ-టీం అంటూ చెబుతున్నారని, నిజానికి తాను ఎవరి టీం కాదని, ప్రజల టీం మాత్రమేనని స్పష్టం చేశారు. తాను సెక్యులర్‌ విధానానికే కట్టుబడి ఉన్నానని, సెక్యులరిజంను వ్యతిరేకించేవారితో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Updated Date - Mar 19 , 2026 | 06:23 AM