భార్యపై కత్తితో భర్త దాడి.. ఏమైందంటే..
ABN , Publish Date - Mar 19 , 2026 | 03:59 PM
మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారులోని కొత్తగుంపులో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలిచివేసింది. కుటుంబ కలహాలు ఒక మహిళ ప్రాణాల మీదకు తీసుకువచ్చాయి. భర్త వీరబోయిన నరేశ్ తన భార్య విజయపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు.
మహబూబాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారులోని కొత్తగుంపులో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలిచివేసింది. కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాల మీదకు తీసుకువచ్చాయి. భర్త వీరబోయిన నరేశ్ తన భార్య వీరబోయిన విజయపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు. భర్త వీరబోయిన నరేశ్ తన భార్య విజయ(26)పై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో విజయకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఏం జరిగిందంటే..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో, ఆవేశానికి లోనైన నరేశ్ తన భార్య విజయపై కొబ్బరి బోండాలు నరికే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు 108 వాహనం ద్వారా ఆమెను మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ విజయకు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, తీవ్ర గాయాలతో పరిస్థితి విషమించింది. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం (MGM) ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిన్ను చంపేస్తాం.. రాజాసింగ్‌కు ఆగంతకుల బెదిరింపు..
హైదరాబాద్‌లో తమ్ముడి రాక్షసత్వం.. అక్కను హత్య చేసి.. ఆపై దారుణంగా..
యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...
Read Latest Telangana News And AP News And International News And Telugu News