Share News

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం

ABN , Publish Date - Mar 19 , 2026 | 03:36 PM

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఈరోజు (గురువారం) విచారణ జరిగింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం
Delhi Liquor Case

ఢిల్లీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) ఈరోజు (గురువారం) విచారణ జరిగింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ అధికారులు (Enforcement Directorate) దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసును జస్టిస్ జస్టిస్ స్వర్ణకాంత శర్మ (Swarn Kanta Sharma) ధర్మాసనం విచారించింది.


ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు (ASG SV Raju) వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టు తన అధికార పరిధిని మించి కొన్ని వ్యాఖ్యలు చేసిందని, వాటిని తొలగించాలని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. ఇదిలా ఉండగా, ప్రతివాదులు తమ సమాధానం (రిప్లై) దాఖలు చేయడానికి మరింత సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఈడీ తరఫు న్యాయవాది మాత్రం రిప్లై అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా జస్టిస్ స్వర్ణకాంత శర్మ ట్రయల్ కోర్టు తన అధికార పరిధిని మించిందా లేదా అనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అలాగే ట్రయల్ కోర్టు తీర్పు సుమారు 600 పేజీలుగా ఉందని ప్రతివాదులు కోర్టుకు తెలిపారు. ప్రతివాదుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, రిప్లై దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నిన్ను చంపేస్తాం.. రాజాసింగ్‌కు ఆగంతకుల బెదిరింపు..

హైదరాబాద్‌లో తమ్ముడి రాక్షసత్వం.. అక్కను హత్య చేసి.. ఆపై దారుణంగా..

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 19 , 2026 | 03:51 PM