Share News

25 లక్షల ఉద్యోగాల సాధనకు సర్కార్ కృషి: మంత్రి అనగాని సత్యప్రసాద్

ABN , Publish Date - Mar 19 , 2026 | 04:47 PM

జాబ్ క్యాలెండర్ విడుదల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తాజా జాబ్ క్యాలెండర్‌ ద్వారా ప్రభుత్వం.. విద్య, పోలీస్ శాఖలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి అన్నారు.

25 లక్షల ఉద్యోగాల సాధనకు సర్కార్ కృషి: మంత్రి అనగాని సత్యప్రసాద్
Anagani Sathya Prasad

అమరావతి, మార్చి 19: యువతకు ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం(AP Government) జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీనిపై మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Anagani Satyaprasad) స్పందిస్తూ.. ఉగాది పర్వదినాన రాష్ట్ర యువతకు మంత్రి నారా లోకేశ్ తీపి కబురు అందించారని తెలిపారు. జాబ్ క్యాలెండర్ విడుదల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. గత 22 నెలల్లో ఆరున్నర లక్షల ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు.


తాజా జాబ్ క్యాలెండర్‌ ద్వారా ప్రభుత్వం.. విద్య, పోలీస్ శాఖలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి అన్నారు. ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచేందుకు మంత్రి లోకేశ్ చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని తెలిపారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేసిందని విమర్శలు గుప్పించారు. కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా, కమీషన్ల కోసం ఉన్నవాటిని వెళ్లగొట్టి ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు 25 లక్షల ఉద్యోగాల సాధనకు కృషి చేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఉగాది ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలి: మంత్రి కొల్లురవీంద్ర

ఇదే కొనసాగితే భవిష్యత్తులో అద్భుతంగా ఏపీ చిత్రపఠం: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 19 , 2026 | 05:04 PM