Share News

స్టాక్ మార్కెట్లకు గ్యాస్ దెబ్బ.. భారీగా పతనమైన దేశీయ సూచీలు..

ABN , Publish Date - Mar 19 , 2026 | 04:06 PM

ఖతార్‌లోని గ్యాస్ క్షేత్రంపై జరిగిన దాడులు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముడి చమురు ధరలు పెరగడం, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయంపై ఆందోళనలు మదుపర్లను కలవరపెట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ ఒక బ్యారెల్‌కు మూడు శాతం పెరిగి 111 డాలర్లకు చేరుకుంది.

స్టాక్ మార్కెట్లకు గ్యాస్ దెబ్బ.. భారీగా పతనమైన దేశీయ సూచీలు..
Stock Market

ఖతార్‌లోని గ్యాస్ క్షేత్రంపై జరిగిన దాడులు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముడి చమురు ధరలు పెరగడం, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయంపై ఆందోళనలు మదుపర్లను కలవరపెట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ ఒక బ్యారెల్‌కు మూడు శాతం పెరిగి 111 డాలర్లకు చేరుకుంది. విదేశీ మదుపర్లు బుధవారం రూ.2714 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఇన్ని ప్రతికూలతల నేపథ్యంలో దేశీయ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (76,704)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 2000 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఒక దశలో 74 వేల దిగువకు కూడా పడిపోయింది. చివరకు సెన్సెక్స్ 2496 పాయింట్ల నష్టంతో 74,207 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 775 పాయింట్ల నష్టంతో 23,002 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాలూ నష్టాల్లోనే కదలాడాయి (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా షేర్లు మాత్రమే స్వల్ప లాభాలు ఆర్జించాయి (share market news). పెట్రోనాట్ ఎల్‌ఎన్‌జీ, శ్రీరామ్ ఫైనాన్స్, హిందుస్థాన్ పెట్రో, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఎన్‌బీసీసీ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 1875 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1797 పాయింట్లు దిగజారింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.63గా ఉంది.


ఇవి కూడా చదవండి..

భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..


మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..

Updated Date - Mar 19 , 2026 | 04:09 PM