భారీగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:45 PM
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం వెండి ధరలు గురువారం భారీ తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది.
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం భారీ తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది. (Gold prices).
ఈ రోజు (మార్చి 19న) సాయంత్రం 5:30 గంటల సమయంలో హైదారాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,50,280కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే దాదాపు రూ.7140 మేర తగ్గుదల నమోదు చేసింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,750 దగ్గర ఉంది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.6550 మేర తగ్గింది.
మరోవైపు వెండి ధరల్లో కూడా తగ్గుదల కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.60 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.65 లక్షలుగా ఉంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..
మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..