-
-
Home » Mukhyaamshalu » Andhrapradesh Telangana National International news ABN Andhrajyothy Live Updates of 6th March 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 06 , 2026 | 07:39 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 06, 2026 21:03 IST
నేపాల్ ఓట్ల కౌంటింగ్..
ముందంజలో నూతన పార్టీ ఆర్ఎస్‌పీ
ప్రతినిధుల సభకు గురువారం ఎన్నికలు
165 స్థానాలకు ఎన్నికలు
శుక్రవారం మొదలైన కౌంటింగ్
95 స్థానాల్లో ముందంజలో ఉన్న ఆర్ఎస్‌పీ
-
Mar 06, 2026 20:57 IST
ఏఐసీసీ సంచలన నిర్ణయం..
తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిని ప్రకటించిన ఏఐసీసీ
తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామకం
-
Mar 06, 2026 20:40 IST
పల్లగిరి గట్టులో మంటలు
ఎన్టీఆర్ జిల్లా: నందిగామ పల్లగిరి గట్టులో మంటలు
కొండ పైప్రాంతం నుంచి వ్యాపించిన మంటలు
-
Mar 06, 2026 19:58 IST
యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌తో చర్చల ప్రసక్తే లేదు: ట్రంప్
ఎలాంటి షరతులు లేకుండా ఇరాన్ లొంగిపోవాలి: ట్రంప్
ఇరాన్ లొంగిపోతేనే చర్చలపై ఆలోచిస్తాం: ట్రంప్
-
Mar 06, 2026 19:58 IST
విజయవాడ: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆటవిడుపు కార్యక్రమం
పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రజాప్రతినిధుల పిల్లలతో సరదాగా గడిపిన మంత్రి లోకేష్
భీముడు పాత్రలో అలరించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ
-
Mar 06, 2026 19:31 IST
ఏపీ లిక్కర్ కేసులో నిందితుల ఆస్తులు అటాచ్ చేసిన ED
రూ.441 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు అటాచ్ చేసిన ED
రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, చాణక్య ఆస్తులు అటాచ్
షెల్ కంపెనీల ద్వారా రూ.1,048 కోట్లు కొల్లగొట్టారని పేర్కొన్న ED
-
Mar 06, 2026 19:23 IST
UPSC సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటిన తెలంగాణ అభ్యర్థులు
సివిల్స్ అభ్యర్థుల కోసం రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకం అమలుచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సివిల్స్‌కు హాజరైన 202మంది అభ్యర్థులకు ఇప్పటికే రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం
ఆర్థిక సాయం అందుకున్న వారిలో ఇంటర్వ్యూలకు 51 మంది ఎంపిక
తుది ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించిన 20 మంది అభ్యర్థులు
విజయం సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ అభినందనలు
-
Mar 06, 2026 19:22 IST
కొనసాగుతున్న నేపాల్ ఎన్నికల కౌంటింగ్
ఆధిక్యంలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP)
ఖాఠ్మండూలో మెజారిటీ స్థానాల్లో RSP గెలుపు
సింగిల్ డిజిట్‌కే పరిమితమైన నేపాలీ కాంగ్రెస్
కొత్తతరం నాయకత్వానికే యువత మొగ్గు
-
Mar 06, 2026 19:20 IST
హైదరాబాద్: కొత్వాల్‌గూడ బయల్దేరిన సీఎం రేవంత్
బుద్వేల్ లేఅవుట్‌తో కలిపి రేడియల్ రోడ్-2..
ఇంటర్‌చేంజ్ పనులకు శంకుస్థాపన చేయనున్న రేవంత్
కొత్వాల్‌గూడలో ఎకో హిల్‌పార్క్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్
-
Mar 06, 2026 19:20 IST
కాకినాడ: ఏలేశ్వరం మండలం సి.రాయవరం దగ్గర ప్రమాదం
అదుపుతప్పి ఏలేరు ఎడమ కాల్వలోకి దూసుకెళ్లిన బైక్
యువకుడు విజయ్‌ను కాపాడిన స్థానికులు, ఆస్పత్రికి తరలింపు
గల్లంతైన మరో యువకుడు లోవరాజు కోసం గాలింపు
-
Mar 06, 2026 19:19 IST
హైదరాబాద్: గచ్చిబౌలిలో పేలిన హీలియం గ్యాస్ బెలూన్
గ్యాస్ బెలూన్ పేలి నలుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో ఘటన
-
Mar 06, 2026 18:20 IST
ఖతార్ ప్రభుత్వం సంచలన ప్రకటన
యుద్ధం మరో రెండు వారాలు కొనసాగితే..
బ్యారెల్ ముడిచమురు ధర 150 డాలర్లు: ఖతార్
ప్రపంచ దేశాలకు పెను సంక్షోభం తప్పదు: ఖతార్
-
Mar 06, 2026 18:20 IST
తిరువూరులో హైటెన్షన్..144 సెక్షన్ అమలు
నియోజకవర్గ అభివృద్ధిపై ఇరువర్గాల నేతల మధ్య మాటల యుద్ధం
తిరువూరు బోసు బొమ్మ సెంటర్‌లో బహిరంగ చర్చకు సిద్ధమైన వైనం
పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల నేతలను స్టేషన్‌కి తరలింపు
తిరువూరు మండలంలో 144 సెక్షన్ విధింపు
-
Mar 06, 2026 17:53 IST
రష్యాపై అమెరికా ఆరోపణలు
మాతో రష్యా పరోక్ష యుద్ధం చేస్తోంది: అమెరికా
యుద్ధంలో ఇరాన్‌కు రష్యా సహకరిస్తోంది: అమెరికా
గల్ఫ్, పశ్చిమాసియాలోని సైనిక స్థావరాలు గుర్తించి ఇరాన్‌కు రష్యా సమాచారం అందిస్తోంది: అమెరికా
రష్యా సమాచారంతోనే మా యుద్ధ విమానాలు యుద్ధ నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది: అమెరికా
-
Mar 06, 2026 17:35 IST
ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా
-
Mar 06, 2026 17:19 IST
తిరుమల లడ్డూ అంశంపై మండలిలో మంత్రి ఆనం ప్రకటన
వైసీపీ హయాంలో టీటీడీని కుటుంబ వ్యవస్థలా మార్చేశారు: ఆనం
టీటీడీ నెయ్యి టెండర్ల నిబంధనలను పూర్తిగా మార్చేశారు: ఆనం
వైసీపీ నేతలకు దేవుడిపై నమ్మకం లేదు.. భయం, భక్తి అసలే లేవు: ఆనం
లడ్డూలో కల్తీ జరిగిందని సిట్ నివేదికలో స్పష్టంగా ఉంది: మంత్రి ఆనం
-
Mar 06, 2026 17:18 IST
నామినేషన్ తిరస్కరణ
తెలంగాణ: రాజ్యసభ ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి నామినేషన్ తిరస్కరణ
నామినేషన్ పత్రంపై 10మంది MLAల సంతకాలు లేకపోవడంతో తిరస్కరణ
-
Mar 06, 2026 17:02 IST
ఆసీస్‌తో ఏకైక టెస్టు.. భారత్ 198 పరుగులకు ఆలౌట్
పెర్త్ వేదికగా ఏకైక టెస్టులో తలపడుతున్న భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగి 198 పరుగులకు ఆలౌటైన టీమిండియా
జెమీమా రోడ్రిగ్స్(52) హాఫ్ సెంచరీ
-
Mar 06, 2026 16:58 IST
విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆత్మీయ సమావేశం
ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
క్రీడల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం చేతుల మీదుగా బహుమతుల ప్రదానం: మంత్రి
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సాయంత్రం 6 లోపు సభా ప్రాంగణంలోకి చేరుకోవాలి: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
-
Mar 06, 2026 16:49 IST
ఇరాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
టెహ్రాన్‌తోపాటు పలు నగరాల్లో బాంబు దాడులు
టెహ్రాన్‌లోని మిలిటరీ అకాడమీని మిసైళ్లతో ధ్వంసం చేసిన IDF
సౌదీ అరేబియా, జోర్డాన్‌పై డ్రోన్లతో ఇరాన్ దాడి
-
Mar 06, 2026 16:47 IST
క్యాతనపల్లి మున్సిపాలిటీ వివాదం.. హైకోర్టు ఏం చెప్పిందంటే..
క్యాతనపల్లి మున్సిపాలిటీ వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ
మూడు వారాల్లోగా చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకోవాలని హైకోర్టు ఆదేశం
-
Mar 06, 2026 16:28 IST
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మండలంలో 144 సెక్షన్
శాంతిభద్రతల దృష్ట్యా తహశీల్దార్ ఆదేశాలు
అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలు చేయరాదు: తహశీల్దార్
ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు: తహశీల్దార్
-
Mar 06, 2026 16:27 IST
బాబోయ్ పులి..
పోలవరం: ఎటపాక మండలం చోడవరంలో పెద్దపులి సంచారం
పులి పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు
సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
-
Mar 06, 2026 16:25 IST
వైసీపీ MLC బొత్సకు మరోసారి అస్వస్థత
అమరావతి: మళ్లీ బొత్సకు అస్వస్థత
BPలో హెచ్చుతగ్గులను గుర్తించిన వైద్యులు
మండలి నుంచి బొత్సను ఇంటికి తీసుకువెళ్లిన సహచరులు
బొత్సతో ఫోన్‌లో మాట్లాడిన సిటీ న్యూరో వైద్యుడు చంద్రశేఖర్ రెడ్డి
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు చెప్పిన డా.చంద్రశేఖర్ రెడ్డి
బీపీ కంట్రోల్‌లోకి రాకపోతే ఆస్పత్రికి రావాలని వైద్యుల సూచన
-
Mar 06, 2026 16:18 IST
వర్గీకరణ అంశంలో మాదిగలవైపు న్యాయం ఉంది: సీఎం రేవంత్
అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మీవైపే నిలబడ్డా: సీఎం రేవంత్
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత.. వర్గీకరణ కోసం..
ప్రకటన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణనే: సీఎం రేవంత్
-
Mar 06, 2026 16:18 IST
వర్గీకరణ కోసం మాదిగ జాతి ఎంతో పోరాడింది: సీఎం రేవంత్
రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడారు: సీఎం రేవంత్
ఈ పోరాటంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు: సీఎం రేవంత్
20 ఏళ్ల నుంచీ వర్గీకరణ సమస్య ఉంది: సీఎం రేవంత్
మీ న్యాయమైన హక్కు కోసం మొదటి నుంచీ మద్దతుగా ఉన్నాం: రేవంత్
-
Mar 06, 2026 16:17 IST
ప్రజాపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు: సీఎం రేవంత్
ఎన్నికల్లో మీరంతా మాకు అండగా నిలబడ్డారు: సీఎం రేవంత్
మార్పు కోసమే ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు: సీఎం రేవంత్
మాది పేదల పక్షపాతి ప్రభుత్వం: సీఎం రేవంత్
-
Mar 06, 2026 16:16 IST
హైదరాబాద్ శిల్పకళావేదికలో మాదిగ ఎంప్లాయిస్ సమన్వయ కమిటీ సమావేశం
ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్, మంత్రులు రాజనర్సింహ, లక్ష్మణ్
ఇప్పుడున్నది మీరంతా కోరుకున్న ప్రభుత్వం: సీఎం రేవంత్
ఇది మీరంతా కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వం: సీఎం రేవంత్
చిత్తశుద్ధితో ప్రజాసమస్యలు పరిష్కరిస్తున్నాం: సీఎం రేవంత్
-
Mar 06, 2026 15:45 IST
ఛత్తీస్‌గఢ్‌లో ప్రైవేట్ బస్సు బోల్తా.. ఐదుగురి మృతి
తప్కరా పోలీస్ స్టేషన్ పరిధి గోడాంబ సమీపంలో బస్సు బోల్తా
ఐదుగురి మృతి, 20మందికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
ప్రమాద సమయంలో బస్సులో 24మంది ప్రయాణికులు
అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ
-
Mar 06, 2026 15:43 IST
ద్రవ్య వినిమయ బిల్లుపై మండలిలో చర్చ
అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు: బొత్స
నా మాటల్లో తప్పు ఉంటే ఒప్పుకుంటా: బొత్స
కాగ్ రిపోర్టు పంపించడానికి అభ్యంతరమేంటి?: బొత్స
ఆర్థికమంత్రి ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారు: బొత్స
-
Mar 06, 2026 15:42 IST
బొత్స వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కౌంటర్
ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఇవ్వాలి: పయ్యావుల
కాగ్ నివేదికలో అభ్యంతరాలు చెబితే పరిశీలిస్తాం: పయ్యావుల
గతం కంటే ఇప్పుడు ఏపీ రెవెన్యూ పెరిగింది: పయ్యావుల
ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు?: పయ్యావుల
వైసీపీ హయాంలో నిధులు దారిమళ్లించారు: పయ్యావుల
-
Mar 06, 2026 15:41 IST
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
1097 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
315 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
Mar 06, 2026 15:21 IST
ఏపీకి కొత్త సీజే..
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
ఏప్రిల్‌లో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా గిల్
-
Mar 06, 2026 15:20 IST
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
1050 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్
300 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ
-
Mar 06, 2026 15:04 IST
త్వరలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో SIR
22 రాష్ట్రాల్లో SIRకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
-
Mar 06, 2026 15:02 IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. పూర్తి వివరాలు..
ప్రవేశపెట్టిన బిల్లుల సంఖ్య - 18
ఆమోదం పొందిన బిల్లుల సంఖ్య - 18
ప్రసంగించిన సభ్యుల సంఖ్య - 122
లఘు చర్చలు - 1
344వ నియమం కింద చర్చించిన అంశాలు - 1
74 నియమం కింద చర్చించిన అంశాలు - 1
ముఖ్యమంత్రి/మంత్రులు చేసిన ప్రకటనలు - 3
ప్రభుత్వ తీర్మానం - 1
-
Mar 06, 2026 15:02 IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. పూర్తి వివరాలు..
శాసనసభ సమావేశమైన రోజులు - 15
శాసనస కార్యకలాపాలు జరిపిన సమయం - 72.14 గంటలు
మౌఖికంగా సమాధానం ఇవ్వబడిన స్టార్ సింబల్ ప్రశ్నలు - 122
సభాసమక్షంలో ఉంచిన స్టార్ సింబల్ లేని ప్రశ్నలు - 6
సభాసమక్షంలో ఉంచిన స్వల్ప వ్యవధి ప్రశ్నలు - 2
-
Mar 06, 2026 14:48 IST
సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు
సృజన -55, డీఎస్కే ప్రచేత్ - 193, ఎస్.వర్షిత్‌రెడ్డి - 259వ ర్యాంక్
ఎం.పవన్‌కుమార్‌రెడ్డి - 297, వి.విక్రమసింహారెడ్డి - 541వ ర్యాంక్
గుమ్మల శ్వేత - 573, V.విజయసింహారెడ్డి - 682వ ర్యాంక్
పోతుపురెడ్డి భార్గవ్ - 738, పుడారి రాహుల్ - 748వ ర్యాంక్
కత్తిమాని అనిరుధ్ - 786, కోరపోతుల శ్రీకర్‌రాజు - 806వ ర్యాంక్
ఇస్లావత్ శ్రీరామ్ హర్ష - 823, కట్టా ప్రత్యూష - 908వ ర్యాంక్
గోగుల రాజశేఖర్ - 920, గుగులోతు జితేందర్ నాయక్ - 939వ ర్యాంక్
-
Mar 06, 2026 14:47 IST
UPSC సివిల్స్ ఫలితాలు విడుదల
అనూజ్ అగ్నిహోత్రికి ఫస్ట్ ర్యాంక్
రాజేశ్వరి సువేకు రెండో ర్యాంక్
ఆకాన్ష్ ధుల్‌కు మూడో ర్యాంక్
రాఘవ్ ఝున్‌ఝున్ వాలాకు నాలుగో ర్యాంక్
-
Mar 06, 2026 14:39 IST
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
-
Mar 06, 2026 14:38 IST
వైసీపీ రాజ్యాంగ విలువలు పాటించడం లేదు: సీఎం చంద్రబాబు
11 సీట్లు గెలిచినవారు అసెంబ్లీకి రావాలి కదా?
ప్రతిపక్ష హోదా ఇచ్చేది మేము కాదు.. ప్రజలు
వైసీపీకి ప్రజలు 11 సీట్లు మాత్రమే ఇచ్చారు
ప్రజలు ఓట్లు వేస్తేనే అధికార, ప్రతిపక్ష హోదాలు వస్తాయి
-
Mar 06, 2026 14:37 IST
ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారు: సీఎం
ఇష్టానుసారం అప్పులు చేసి ప్రజలపై భారం మోపారు
అలాంటి రుణాలను కేంద్రం సహకారంతో రీషెడ్యూల్ చేయించాం
మరికొన్ని రుణాల రీషెడ్యూల్ కోసం ప్రయత్నిస్తున్నాం
-
Mar 06, 2026 14:37 IST
ఇబ్బందులున్నా సూపర్-6 పథకాలు కొనసాగింపు: చంద్రబాబు
టీడీపీ ప్రభుత్వం వల్లే పోలవరం సాకారమవుతోంది
గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేస్తాం
పోలవరం నిర్మాణం క్వాలిటీ విషయంలో రాజీ ఉండదు
-
Mar 06, 2026 14:36 IST
కేంద్రం సహకారంతో అమరావతిని తీర్చిదిద్దుతున్నాం: చంద్రబాబు
రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ నీటితో కళకళలాడుతున్నాయి
భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం
-
Mar 06, 2026 14:36 IST
ఎన్ని ఇబ్బందులున్నా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని మాటిచ్చాం: సీఎం
ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు
వైసీపీ హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు కొంతవరకు తగ్గించాం
-
Mar 06, 2026 14:35 IST
కొందరు హింసను ప్రోత్సహిస్తున్నారు: సీఎం చంద్రబాబు
కొత్తగా రప్పా రప్పా అంటూ రెచ్చిపోతున్నారు
వైసీపీ నేతలు రాష్ట్రంలో విధ్వంస యాత్రలు చేస్తున్నారు
పరామర్శల పేరుతో జగన్ ప్రజలకు నరకం చూపిస్తున్నారు
వైసీపీ డ్రామాలతో అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి
గంజాయి బ్యాచ్ పరామర్శలకు వెళ్లడం సిగ్గుచేటు
-
Mar 06, 2026 14:29 IST
తిరుమలపై కుట్రతోనే మహాపచారం: సీఎం చంద్రబాబు
నాడు ఏడు కొండలు కాదు.. 2 కొండలు అన్నారు: చంద్రబాబు
తిరుమలలో అపవిత్రంపై పీఠాధిపతులు అసహనం: చంద్రబాబు
ముందు చేసింది అపవిత్రం.. ఇప్పుడు చేసేది కొనసాగింపు: సీఎం
రాజకీయాల్లో విలువలు ఉండాలి.. రక్షిస్తూ ముందుకు సాగాలి: సీఎం
-
Mar 06, 2026 13:48 IST
ఏపీ అసెంబ్లీ: సోషల్ మీడియాపై చంద్రబాబు కీలక ప్రకటన
13 ఏళ్ల వయసులోపు ఉన్నవారికి సోషల్ మీడియా నిషేధం
సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చూస్తాం
90 రోజుల్లో అమలు చేసే దిశగా చర్యలు
టెక్నాలజీని వాడుకుంటే ఉపయోగపడుతుంది
టెక్నాలజీకి బానిసైతే జీవితం నాశనమవుతుంది
-
Mar 06, 2026 13:23 IST
కర్ణాటక: 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా వాడకం నిషేధం
కర్ణాటక: మొబైల్ వాడకం దుష్ప్రభావాల నివారణకు చర్యలు
బడ్జెట్ ప్రసంగంలో నిషేధం గురించి ప్రస్తావించిన సీఎం సిద్దరామయ్య
-
Mar 06, 2026 13:12 IST
అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చిట్‌చాట్
కాపులకు గత మూడు బడ్జెట్లలో ప్రాధాన్యం దక్కలేదు
కాపులను బీసీల్లో చేర్చుతామన్న హామీని నెరవేర్చాలి
2029లో ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీనే
-
Mar 06, 2026 13:11 IST
ట్రంప్ అధికారాలను కుదించేందుకు యూఎస్ ప్రతినిధుల సభలో బిల్లు
స్వల్ప ఓట్ల తేడాతో వీగిపోయిన బిల్లు
ఇరాన్ మీద పెత్తనంపై ప్రతినిధుల సభలో ఓటింగ్
ట్రంప్‌నకు వ్యతిరేకంగా 212 మంది, అనుకూలంగా 219 ఓట్లు
-
Mar 06, 2026 12:47 IST
ఈనెల 10న కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
ఈనెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం
-
Mar 06, 2026 12:40 IST
అమెరికాపై యుద్ధ భారం
ఇరాన్‌పై దాడికి తొలి 100 గంటల్లో భారీ వ్యయం
మొదటి 100 గంటల్లో రూ.30,710కోట్లు ఖర్చు చేసిన అమెరికా
రోజుకు రూ.7,395 కోట్లు వ్యయం
లెక్కలు వెల్లడించిన CSIS థింక్ ట్యాంక్
-
Mar 06, 2026 12:33 IST
ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ సభ్యులు 11 మందే ఉన్నా 1100 మంది ఉన్నట్లు మాట్లాడతారు
మనం ఎందుకో చేసింది చెప్పుకోలేకపోతున్నాం
కూటమిలో పార్టీలు కలిసికట్టుగా ఉండాలి
కూటమిలో పార్టీలు వేరువేరు సమూహాల నుంచి వచ్చాయి
15 ఏళ్లు ఏపీ కోసం కలిసి పాటుపడదాం
-
Mar 06, 2026 11:59 IST
విద్యా వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది: పవన్
కేంద్ర నిధులను కూడా దుర్వినియోగం చేసింది
జల్‌జీవన్ మిషన్‌కు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది
కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా రూ.7వేల కోట్లకుపైగా జతచేశాం
వైసీపీ వల్ల రూ.8,700కోట్ల జల్‌జీవన్ మిషన్ నిధులు నిరుపయోగమయ్యాయి
ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యం
మెగా డీఎస్సీ ద్వారా 16వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీ
వైసీపీ పట్టించుకోకుండా వదిలేసిన అనేక ప్రాజెక్టులను ప్రారంభించాం
-
Mar 06, 2026 11:56 IST
కూటమి ఏర్పాటు కోసం కష్టపడ్డాను: పవన్ కల్యాణ్
నేను గెలవడం కంటే ఏపీ అభివృద్ధి ముఖ్యమనుకున్నా
అందుకే కూటమితో కలిశా
కూటమి ఇలానే బలంగా కొనసాగాలని కోరుకుంటున్నా
చంద్రబాబు ఆధ్వర్యంలో 11.75శాతం గ్రోత్ రేట్ సాధించాం
-
Mar 06, 2026 11:55 IST
ఢిల్లీ: పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో ప్రధాని మోదీ ప్రసంగం
వివిధ ప్రభుత్వ పథకాలతో రైతులకు ఆర్థిక రక్షణ: మోదీ
ఎగుమతి ఆధారిత రంగంగా వ్యవసాయాన్ని మార్చాలి: మోదీ
భారత్‌లో వైవిధ్యభరితమైన వాతావరణాన్ని రైతులు వాడుకోవాలి: మోదీ
-
Mar 06, 2026 11:21 IST
ఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధంలో 200 మంది పిల్లలు మృతి: యూనిసెఫ్
ఇరాన్‌లో 181 మంది పిల్లలు మృతి: యూనిసెఫ్
లెబనాన్‌లో ఏడుగురు చిన్న పిల్లలు మృతి: యూనిసెఫ్
ఇజ్రాయెల్‌లో ముగ్గురు పిల్లలు మృతి: యూనిసెఫ్
కువైట్‌లో ఒక చిన్నారి మృతి: యూనిసెఫ్
యుద్ధాలు పిల్లలు ప్రారంభించరు, కానీ భారీ మూల్యం చెల్లిస్తారు: యూనిసెఫ్
దక్షిణ ఇరాన్‌లోని మీనాబ్ పట్టణంలో బాలికల పాఠశాలపై దాడి: యూనిసెఫ్
స్కూల్‌పై దాడిలో 175 మంది విద్యార్థినులు మృతి చెందినట్లు వెల్లడించిన IRGC
-
Mar 06, 2026 11:17 IST
ఢిల్లీ: ఇరాన్ కూలిపోతోంది: ట్రంప్
ఇరాన్ ఎయిర్‌ఫోర్స్ ముగిసింది: ట్రంప్
టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు
నివాస ప్రాంతాలపై దాడులు
టెహ్రాన్ యూనివర్సిటీ సమీపంలో బాంబులు
లెబనాన్ పట్టణాలపై ఇజ్రాయెల్ దాడులు
-
Mar 06, 2026 11:16 IST
అమరావతి: ఏపీ లిక్కర్ కేసులో చాణక్య(ఏ8)కు బెయిల్
రాజ్ కసిరెడ్డి సన్నిహితుడు భూనేటి చాణక్య
ఎద్దల నవీన్ కృష్ణ(A36), బాలాజీ(A35)కు కూడా హైకోర్టు బెయిల్
-
Mar 06, 2026 11:02 IST
అమరావతి: వ్యాట్ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్
వ్యాట్ సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం
-
Mar 06, 2026 10:54 IST
దివ్వెల మాధురి, తనూజపై చట్టపరమైన చర్యలకు టీటీడీ సిద్ధం
కేక్ కటింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ సిబ్బంది
టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో కేక్ కటింగ్
అతిథి గృహాల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం నిషేధమన్న టీటీడీ
-
Mar 06, 2026 10:51 IST
ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ సంక్షోభంలో భారత్‌కు రిలీఫ్..
-
Mar 06, 2026 10:50 IST
వైసీపీ సభ్యులపై మండలి చైర్మన్ ఆగ్రహం..
-
Mar 06, 2026 10:48 IST
నంద్యాల: ఆత్మకూరు పెచ్చెరువు సమీపంలో అగ్నిప్రమాదం
అగ్నికి ఆహుతి అవుతున్న అటవీ సంపద
కార్చిచ్చును నివారించేందుకు వెళ్లిన ప్రొటెక్షన్ వాచర్లు
ప్రొటెక్షన్ వాచర్ల మూడు మోటార్ బైక్‌ల దగ్ధం
-
Mar 06, 2026 10:47 IST
అనిల్ అంబానీ, రిలయన్స్ పవర్‌కు చెందిన సంస్థల్లో ఈడీ సోదాలు
ఉదయం నుంచి 12 ప్రాంతాల్లో 15 బృందాలతో ఈడీ తనిఖీలు
-
Mar 06, 2026 10:45 IST
ఏపీ అసెంబ్లీ: పల్లెపండుగ 2.0 అమలుపై మంత్రి నాదెండ్ల సమాధానం
ఉపాధిహామీ పథకం కింద రోడ్ల నిర్మాణం పల్లెపండుగ రూపంలో చేపట్టాం: నాదెండ్ల
సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఇంకుడుగుంతలు, మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మిస్తున్నాం: నాదెండ్ల
2025-26 కోసం బడ్జెట్‌లో రూ.4,350 కోట్లు విడుదలయ్యాయి: మంత్రి నాదెండ్ల
-
Mar 06, 2026 10:44 IST
ఏపీ అసెంబ్లీ: ఏపీలో ఆహార కల్తీ నియంత్రణకు చర్యలు చేపట్టాం: సత్యకుమార్
ఆహార కల్తీ నిర్థారించే ప్రయోగశాలలు పెంచుతాం: సత్యకుమార్
ఆహార కల్తీపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం: సత్యకుమార్
-
Mar 06, 2026 10:32 IST
అమరావతి: ఏపీ శాసన మండలి కొద్ది సేపు వాయిదా
వైసీపీ సభ్యుల ఆందోళనతో కొద్ది సేపు వాయిదా వేసిన చైర్మన్
-
Mar 06, 2026 10:29 IST
ఇరాన్ తర్వాత క్యూబా సంగతి తేలుస్తాం: ట్రంప్
క్యూబాలో నాయకత్వ మార్పే లక్ష్యం: ట్రంప్
-
Mar 06, 2026 10:28 IST
కువైట్‌లో ఎంబసీ కార్యకలాపాలను నిలిపివేసిన అమెరికా
తమ ప్రజల భద్రతే ముఖ్యమన్న అమెరికా
కువైట్‌లో లెవల్-3 ట్రావెల్ అడ్వైజరీ కొనసాగుతుంది: అమెరికా
-
Mar 06, 2026 10:28 IST
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
సెన్సెక్స్ 380, నిఫ్టీ 110 పాయింట్లకు పైగా నష్టం
-
Mar 06, 2026 10:27 IST
రష్యా నుంచి చమురు కొనుగోలులో భారత్‌కు తాత్కాలిక మినహాయింపు
ఇరాన్ యుద్ధం దృష్ట్యా 30 రోజులు మినహాయింపు ఇచ్చిన అమెరికా
మినహాయింపు ఇస్తున్నట్టు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ వెల్లడి
-
Mar 06, 2026 10:27 IST
అసోంలో సుఖోయ్ యుద్ధ విమాన ప్రమాదం
ఘటనలో పైలట్లు అనూజ్, దుర్గాకర్ మృతి
పైలట్ల మృతిపట్ల భారత వాయుసేన సంతాపం
-
Mar 06, 2026 10:20 IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 15వ రోజు ప్రారంభం
శాసనసభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
గుంటూరులోని వట్టిచెరుకూరులో డిస్నీ ల్యాండ్ ఏర్పాటుపై ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రశ్న
ఈ ప్రాజెక్ట్‌కు భారీ మొత్తంలో పెట్టుబడి అవసరం: మంత్రి దుర్గేశ్
-
Mar 06, 2026 10:17 IST
అమరావతి: ఏపీ శాసన మండలి ప్రారంభం
శాసన మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం
గీతం యూనివర్సిటీ భూకేటాయింపులపై చర్చించాలని వాయిదా తీర్మానం
వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్
సభలో వైసీపీ సభ్యుల ఆందోళన
ప్లకార్డులతో పోడియం వద్ద నినాదాలు
వైసీపీ సభ్యులపై చైర్మన్ ఆగ్రహం
-
Mar 06, 2026 10:04 IST
ఇరాన్-అమెరికా వార్.. ఇద్దరు భారతీయుల మృతి
ఒమన్ స్కైలైట్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి
భారత్‌కు చెందిన ఆశిష్ కుమార్, దీక్షిత్ సోలంకి మృతి
దలీప్ సింగ్ అనే రాజస్థాన్ వాసి ఆచూకీ గల్లంతు
-
Mar 06, 2026 09:53 IST
అమరావతి: ఏపీ శాసనమండలిలో వైసీపీ వాయిదా తీర్మానం
గీతం వర్సిటీకి భూకేటాయింపుపై చర్చకు తీర్మానం
-
Mar 06, 2026 09:15 IST
నెల్లూరు: కావలి మండలం చెన్నాయపాళెంలో వైసీపీ-టీడీపీ శ్రేణుల ఘర్షణ
టీడీపీ కార్యకర్తలు శ్రీకీర్తి ప్రభాకర్, రామకోటయ్యపై కర్రలతో వైసీపీ నేతల దాడి
టీడీపీ కార్యకర్తల పరిస్థితి విషమం, నెల్లూరు నారాయణ ఆసుపత్రికి తరలింపు
మాజీ AMC చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ అల్లర్లు సృష్టిస్తున్నారని టీడీపీ ఆరోపణ
-
Mar 06, 2026 08:55 IST
గన్నవరం ఎయిర్‌పోర్ట్ దగ్గర గాల్లోనే నాలుగు విమానాలు చక్కర్లు
చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, సింగపూర్, విమానాలు గాలిలో చక్కర్లు
గంట నుంచి హైదరాబాద్, చెన్నై, సింగపూర్, విమానాలు గాలిలో చక్కర్లు
-
Mar 06, 2026 08:49 IST
విజయవాడ: ఇంద్రకీలాద్రి ఆలయంలో ప్రారంభమైన మహా కుంభాభిషేకం
కనకదుర్గనగర్ నుంచి దుర్గ గుడి వరకు కలశపు బిందెలతో ఊరేగింపు
మేళ తాళాలతో దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తుల ఊరేగింపు
8వ తేదీన పూర్ణాహుతి సమయానికి కలశాలకు అభిషేకం
చివరి రోజున మహా కుంభాభిషేకంలో పాల్గొననున్న సీఎం దంపతులు
-
Mar 06, 2026 08:07 IST
ఖమ్మం: తల్లాడ మండలంలో చిరుత సంచారం
కనకగిరిగుట్టలు-పులిగుండాల మధ్య అడవిలో సంచారం
పిల్లలతో ఉన్న చిరుత, జింక, ఎలుగుబంటి
సీసీ టీవీ ట్రాప్ కెమెరాలో గుర్తించిన అధికారులు
కనకగిరిగుట్టల ప్రాంత వాసులు అలర్ట్‌గా ఉండాలని సూచన
-
Mar 06, 2026 08:06 IST
భారత జట్టు విజయంపై మంత్రి లోకేష్ ప్రశంసలు
T20 WCలో ఇంగ్లండ్‌పై భారత్ అద్భుత విజయం: లోకేష్
సంజు శాంసన్, శివమ్ దూబే పోరాటంతో ఫైనల్‌కు భారత్: లోకేష్
-
Mar 06, 2026 08:06 IST
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లోకి భారత్
భారత జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు
ఇంగ్లండ్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది: సీఎం
భారత్ ఆటగాళ్లు తీరు ప్రశంసనీయం: సీఎం చంద్రబాబు
-
Mar 06, 2026 08:04 IST
ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
ఇరాన్ సైన్యం ఆయుధాలు వీడాలి: ట్రంప్
ఇరాన్‌ను దక్కించుకోవటానికి ఇదే సరైన సమయం
మాట వినకపోతే ఇరాన్‌పై యుద్ధం ఆగదు: ట్రంప్
-
Mar 06, 2026 08:03 IST
అసోంలో కుప్పకూలిన Su-30 యుద్ధ విమానం
కార్బీ ఆంగ్‌లోంగ్ జిల్లా సమీపంలో ఘటన
నిన్న రాత్రి రాడార్ నుంచి తెగిపోయిన సంబంధాలు
Su-30 యుద్ధ విమానం శకలాల కోసం IAF గాలింపు
-
Mar 06, 2026 08:02 IST
ఏడో రోజుకు ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం
యుద్ధంతో నిలిచిన ఎగుమతులు
పోర్ట్‌లు, ఎయిర్‌పోర్టుల మూసివేతతో పడిపోయిన గుడ్డు ధర
నిల్వలు పెరిగిపోవడంతో కోడిగుడ్ల ధర పతనం
నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ధర రూ.4.30
స్థానిక మార్కెట్లలో రూ.3.50కి పడిపోయిన గుడ్డు ధర
-
Mar 06, 2026 07:41 IST
మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న తెలంగాణ ప్రభుత్వం
'ప్రజా ప్రభుత్వం-ప్రగతి ప్రణాళిక' పేరుతో కార్యక్రమం
99 రోజులపాటు రెండేళ్ల అభివృద్ధి పాలనను వివరించనున్న ప్రభుత్వం
నేటినుంచి జూన్ 12 వరకు 10 థీమ్‌లతో ప్రభుత్వం కార్యాచరణ
-
Mar 06, 2026 07:41 IST
నేడు కేరళలో రాహుల్‌గాంధీ పర్యటన
ఉ.11గంటలకు కొల్లాంలో రాహుల్ బహిరంగ సభ
మధ్యాహ్నం ఒంటిగంటకు విద్యార్థులతో రాహుల్ ముఖాముఖి
-
Mar 06, 2026 07:40 IST
నేడు మెదక్ జిల్లాలో మంత్రులు దామోదర, వివేక్ పర్యటన
99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష
-
Mar 06, 2026 07:39 IST
పాకిస్థాన్‌పై అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్
హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో పాక్‌పై ఎఫెక్ట్
పాక్‌కు నిలిచిపోనున్న చమురు దిగుమతులు
ఇంధన కొరత నేపథ్యంలో వర్క్‌ఫ్రమ్ హోమ్..
ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలనే యోచనలో పాక్