ఆసీస్‌తో ఏకైక టెస్టు: భారత్ 198 పరుగులకు ఆలౌట్
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:35 PM
పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు ఏకైక టెస్టు మ్యాచులో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 62.4 ఓవర్లలో 198 పరుగులకు కుప్పకూలింది. స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్(52) హాఫ్ సెంచరీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు ఏకైక టెస్టు మ్యాచులో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 62.4 ఓవర్లలో 198 పరుగులకు కుప్పకూలింది. స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్(52) హాఫ్ సెంచరీ చేసింది. జెమీమా మినహా ఇతర బ్యాటర్లు ఎవ్వరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. ఆసీస్ బౌలర్ అన్నాబెల్ సదర్లాండ్ 4 వికెట్లతో చెలరేగింది.
భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ(35), టెస్టులో తొలి మ్యాచ్ ఆడుతున్న కాష్వీ గౌతమ్(34) పర్వాలేదనిపించారు. స్మృతి మంధాన(4), ప్రతీకా రావల్(18), హర్మన్ ప్రీత్ కౌర్(19), దీప్తి శర్మ(7), రిచా ఘోష్(11), స్నేహ్ రాణా(5), సయాలీ సత్ఘరే(7) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 4, హామిల్టన్ 3, బ్రౌన్ 2, ఆష్లీ గార్డ్‌నర్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ నామినీల పేర్లు విడుదల
ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయనవసరం లేదు: రవి శాస్త్రి