Share News

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: అహ్మదాబాద్ పిచ్‌పై ఆందోళన.. ఆ సెంటిమెంట్‌కు భారత్ చెక్ పెడుతుందా?

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:55 PM

టీమిండియా.. టీ20 ప్రపంచ కప్‌ను వరుసగా రెండోసారి ముద్దాడేందుకు కేవలం ఒక్క అడుగే ఉంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తుది పోరులో తలపడనుంది. అయితే.. ఇక్కడే ఓ సమస్య భారత అభిమానుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదే అహ్మదాబాద్ పిచ్!

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: అహ్మదాబాద్ పిచ్‌పై ఆందోళన.. ఆ సెంటిమెంట్‌కు భారత్ చెక్ పెడుతుందా?
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా.. టీ20 ప్రపంచ కప్‌ను వరుసగా రెండోసారి ముద్దాడేందుకు కేవలం ఒక్క అడుగే ఉంది. వాంఖడేలో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తుది పోరులో తలపడనుంది. అయితే.. ఇక్కడే ఓ సమస్య భారత అభిమానుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదే అహ్మదాబాద్ పిచ్!


2023 వన్డే ప్రపంచ కప్.. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా అద్భుత ప్రదర్శనలు చేసింది. లీగ్ స్టేజ్ ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అద్భుత ప్రదర్శనలు చేసింది. ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియమే వేదిక. లీగ్ అంతా ఘనంగా ముగించిన భారత్‌కు గెలుపు లాంఛనమే అనుకున్నారంతా. కానీ సీన్ రివర్స్ అయింది. టీమిండియా ఆ పిచ్‌ను అంచనా వేయలేకపోయింది. బ్యాటర్లంతా విఫలమైన వేళ 240 పరుగులకు టీమిండియా కుప్పకూలింది. మరో వైపు బౌలింగ్‌లోనూ విఫలం. ఫలితం.. ట్రావిస్ హెడ్ అజేయ శతకంతో ఆసీస్‌కు వన్డే ప్రపంచ కప్ దక్కింది. ఆనాటి గాయాలు ఇంకా అభిమానులను వెంటాడుతునే ఉన్నాయి.


ఇప్పుడు పిచ్ ఎలా ఉందంటే..?

ఈసారి టీ20 ప్రపంచ కప్‌లో అహ్మదాబాద్ పిచ్ మాత్రం పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. పెద్ద స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ దశలో ఈ స్టేడియంలో సౌతాఫ్రికా.. కెనడాపై 213 పరుగులు చేసి అత్యధిక స్కోర్ నమోదు చేసింది. అయితే టీమిండియా బ్యాటింగ్ పరంగా బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో తేలిపోతుంది. ఈ ఒక్క విషయంలో రాణిస్తే.. గెలుపు ఖాయమని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.


మరో సవాల్.. న్యూజిలాండ్

ముఖ్యమైన అంశం ఏమిటంటే, టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు న్యూజిలాండ్‌పై గెలవలేదు. కాబట్టి ఈసారి అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ భారత్‌కు కేవలం టైటిల్ పోరే కాదు, గత చేదు జ్ఞాపకాలను చెరిపేసే అవకాశంగా మారింది. భారత్ విజయం సాధిస్తే… అహ్మదాబాద్ కూడా ఒక చారిత్రాత్మక క్షణానికి సాక్ష్యమవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి టీమిండియా ఫైనల్‌లో విజయం సాధించి.. ఈ సెంటిమెంట్లకు చెక్ పెడుతుందా? అనేది చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ నామినీల పేర్లు విడుదల

ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయనవసరం లేదు: రవి శాస్త్రి

Updated Date - Mar 06 , 2026 | 03:57 PM