టీ20 ప్రపంచ కప్: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ నామినీల పేర్లు విడుదల
ABN , Publish Date - Mar 06 , 2026 | 02:48 PM
టీ20 ప్రపంచ కప్ టోర్నీకి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీమెంట్ నామినీల పేర్లను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో 8 మంది ప్లేయర్లు ఉండగా.. టీమిండియా నుంచి సంజు శాంసన్ చోటు దక్కించున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత్ తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టోర్నీకి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీమెంట్ నామినీల పేర్లను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో 8 మంది ప్లేయర్లు ఉండగా.. టీమిండియా నుంచి సంజు శాంసన్ చోటు దక్కించున్నాడు.
సంజుతో పాటు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్, పాకిస్థాన్ ఓపెనర్ ఫర్హాన్, సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్, పేసర్ లుంగి ఎంగిడి, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర, బ్యాటర్ టిమ్ సీఫర్ట్, అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాక్ విక్ ఈ జాబితాలో ఉన్నారు. వీరిలోంచి ఒకరిని అభిమానులే ఎన్నుకునే అవకాశాన్ని ఐసీసీ కల్పించింది. దీని కోసం ఐసీసీ తన వెబ్‌సైట్‌లో ఎంపిక చేసే ఆప్షన్ ఇచ్చింది.
మీరైతే ఎవరికి ఓటేస్తారు?
ఇక్కడ క్లిక్ చేసి ఈ వెబ్‌సైట్‌లో వేయండి
సంజు.. ఆయా షేర్!
సంజు శాంసన్.. టీ20 ప్రపంచ కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగాడు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతూ తుది జట్టులో స్థానాన్నే ప్రశ్నార్థకం చేసుకున్నాడు. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజు తిరిగి పుంజుకున్నాడు. వెస్టిండీస్‌పై కీలక పోరులో 97*, ఇంగ్లండ్‌పై సెమీ ఫైనల్‌లో 89 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ టోర్నీలో నాలుగు మ్యాచులు ఆడిన సంజు.. వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు.
ఇవీ చదవండి:
టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి భారత్.. వరల్డ్ రికార్డ్ బ్రేక్
ఔట్ అనుకుని సాక్షి సెలబ్రేషన్.. ధోని రియాక్షన్ ఇదే..