Share News

ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయనవసరం లేదు: రవి శాస్త్రి

ABN , Publish Date - Mar 06 , 2026 | 02:26 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఘనంగా ఫైనల్‌కు చేరుకుంది. అయితే ప్రస్తుతం స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై ఆందోళన నెలకొంది. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన అభి.. కేవలం 89 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఫామ్‌పై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు.

ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయనవసరం లేదు: రవి శాస్త్రి
Ravi Shastri

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఘనంగా ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే భారత్ ఫైనల్ చేరిందన్న ఆనందం ఓ వైపు ఉంటే.. ప్రస్తుతం అభిమానులను ఆందోళన పెడుతుంది మాత్రం స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్! టోర్నీ ఆరంభం నుంచే పరుగులు రాబట్టడానికి అతడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ పొట్టి ప్రపంచ కప్ టోర్నీ మొత్తంలో 7 మ్యాచ్‌లు ఆడిన అభి.. కేవలం 89 పరుగులే చేశాడు. జింబాబ్వేపై హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఫామ్‌పై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు.


‘అభిషేక్ శర్మను తుది జట్టులో కొనసాగించాలి. ఫైనల్ కోసం జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అయితే ‘నీ సామర్థ్యం మీద నువ్వు నమ్మకంతో ఉండు. తిరిగి పుంజుకో. ధైర్యం కోల్పోవద్దు’ అని అభిషేక్ శర్మకు చెప్పాలి. ఫైనల్‌లో అతడు రాణించే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌పై అతడికి మంచి రికార్డు ఉంది. ‘మేమంతా నీ వెంటే ఉన్నాం అభి.. వెళ్లి ఆడు. ఫైనల్‌లో నువ్వు బాగా ఆడతావు!’ అని రవి శాస్త్రి .. అభిషేక్ శర్మను ఉద్దేశించి అన్నాడు.


సంజులో ఏకాగ్రత లోపిస్తోంది..

‘సంజు శాంసన్ వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచుల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి ఫామ్‌లోకి వచ్చాడు. తాను మరింత నిలకడగా ఆడాలన్న విషయాన్ని సంజు గుర్తించాడు. అతడు ప్రస్తుతం షాట్ సెలక్షన్ విషయంలో మరింత తెలివిగా వ్యవహరిస్తున్నాడు. తిరిగి సంజు పుంజుకున్నాడు.. కానీ అతడిలో ఏకాగ్రత లోపిస్తోంది. సంజు శాంసన్ మానసికంగా బలంగా ఉన్నాడు. టీమిండియాలోకి వచ్చినప్పటి నుంచి అతడి నైపుణ్యం మీద ఎవరికీ సందేహాలు లేవు. కానీ నిలకడ లేమితో నిరాశ పరుస్తూ వచ్చాడు. ఎట్టకేలకు దాని నుంచి బయటపడ్డాడు’ అని రవి శాస్త్రి వెల్లడించాడు.


ఇవీ చదవండి:

టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి భారత్.. వరల్డ్ రికార్డ్ బ్రేక్

ఔట్ అనుకుని సాక్షి సెలబ్రేషన్.. ధోని రియాక్షన్ ఇదే..

Updated Date - Mar 06 , 2026 | 02:26 PM