Share News

ప్రైవేట్ బస్సు బోల్తా పడి స్పాట్‌లో ఐదుగురి దుర్మరణం

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:02 PM

ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్ జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో ఐదుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్కూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే..

ప్రైవేట్ బస్సు బోల్తా పడి స్పాట్‌లో ఐదుగురి దుర్మరణం
Chhattisgarh Bus Accident

ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని జాష్‌పూర్ జిల్లా(Jashpur district )లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మరికొన్ని గంటల్లో తమ గమ్య స్థానం చేరుకుంటామనే లోపు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఒక ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో ఐదుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. తప్కరా పోలీస్ స్టేషన్(Tapkara police station) పరిధిలోని గోడాంబ గ్రామ(Godaamba village) సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.


జార్ఖండ్‌లోని కుర్దేగ్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని కుంకురి పట్టణం వైపు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో బస్సులో ఐదుగురు మృతి చెందారని జాష్‌పూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ లాల్ ఉమేద్ సింగ్ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.


ఇవీ చదవండి:

రికార్డు స్థాయిలో 17వ సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సిద్ధరామయ్య

రాజ్యసభకు బిహార్‌ సీఎం నితీశ్‌ నామినేషన్‌

Updated Date - Mar 06 , 2026 | 04:08 PM