ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:34 PM
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టులో తొలుత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
న్యూఢిల్లీ, మార్చి 6: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్(Justice Lisa Gill) రానున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి జస్టిస్ లీసా గిల్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టులో తొలుత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఏప్రిల్ నెలలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేయనున్నారు. ఆ వెంటనే జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రికార్డు సృష్టించనున్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రతిపక్షం తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది: మంత్రి పయ్యావుల కేశవ్
13ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్‌పై సీఎం కీలక ప్రకటన
Read Latest AP News And Telugu News