Share News

నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..

ABN , Publish Date - Mar 06 , 2026 | 09:49 AM

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. చెన్నాయపాళెంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..
YSRCP VS TDP

నెల్లూరు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. చెన్నాయపాళెంలో వైసీపీ (YSRCP), తెలుగుదేశం (TDP) శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. చెన్నాయపాళె ప్రాంతంలో వైసీపీ మూకలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. టీడీపీ శ్రేణులపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా వైసీపీ మూకలు కర్రలతో దాడి చేశారు.

ఘర్షణలో టీడీపీ శ్రేణులకు గాయాలు..

ఈ దాడిలో టీడీపీ శ్రేణులు శ్రీకీర్తి ప్రభాకర్, రామకోటయ్య గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి వారిని నెల్లూరు నారాయణ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు.


సన్నిబోయిన ప్రసాద్‌పై ఆరోపణలు..

మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ వరస ఘర్షణలు సృష్టిస్తూ స్థానికంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కూడా సన్నిబోయిన ప్రసాద్ వైఖరీలో ఎలాంటి మార్పు లేదని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్తలు విచక్షణా రహితంగా కర్రలతో దాడి చేయడంతో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. సన్నిబోయిన ప్రసాద్ తమపై వరుస దాడులు చేస్తున్నారని.. ఆయన, అనుచరుల వల్ల ఇప్పటివరకు 15 సార్లు ఘర్షణలు చెలరేగాయని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు. సన్నిబోయిన ప్రసాద్ కావాలనే ఘర్షణలు సృష్టిస్తూ గ్రామంలో అలజడి రేపుతున్నారని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ప్రస్తుత పరిస్థితి..

ప్రస్తుతం చెన్నాయపాళెంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు తెలుస్తోంది. బాధితులకు న్యాయం చేయాలని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్

ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 10:03 AM