రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:26 PM
రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలును విస్తరణ సమయంలో తొలగిస్తున్నారని.. వందేళ్లకు పైగా వయసున్న చెట్లను తొలగించటం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వాటిని వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.
అమరావతి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలను విస్తరణ సమయంలో తొలగిస్తున్నారని.. వందేళ్లకు పైగా వయసున్న చెట్లను తొలగించటం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. వాటిని వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. నెలరోజుల్లోనే ఈ విషయంపై సానుకూల నిర్ణయం వస్తుందని తెలిపారు. పంచాయతీరాజ్ బడ్జెట్ రూ.15,485కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖ రూ.11,217కోట్లు, అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు రూ.713కోట్ల బడ్జెట్ గ్రాంట్ల కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.
మొక్కలకు జియో ట్యాగింగ్..
కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లోపు ఈ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షణపైనా దృష్టి పెడతామని తెలిపారు. మొక్కలకు జియో ట్యాగింగ్ విషయం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని వివరించారు. పట్టుబడిన ఎర్రచందనం విక్రయంపై మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఏపీలో మూడు వేల గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించామని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు సకాలంలో ఇచ్చామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే మా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం
Read Latest Telangana News And AP News And Telugu News